RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78520086

ది మరాఠా సహకారి బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది), సెక్షన్ 35 A క్రింద నిర్దేశాలు

తేదీ: 30/12/2019

ది మరాఠా సహకారి బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949
(సహకార సంఘాలకు వర్తించేది), సెక్షన్ 35 A క్రింద నిర్దేశాలు

ఆగష్టు 31, 2016 నాటి ఆదేశం DCBS.CO.BSD-I.No.D-4/12.22.141/2016-17 ప్రకారం ది మరాఠా సహకారి బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర, ఆగష్టు 31, 2016 పనివేళలు ముగింపు నుండి నిర్దేశాల క్రింద ఉంచబడింది. అట్టి నిర్దేశాల కాలపరిమితిని సమయానుసారంగా పొడిగిస్తూ చివరిగా సెప్టెంబర్ 25, 2019 నాటి ఆదేశం DCBR.CO.AID.No.D-20/12.22.140/2019-20 ద్వారా డిసెంబర్ 31, 2019 వరకు చెల్లుబాటు ఐయ్యేలా, సమీక్షకు లోబడి పొడిగించడమైనది.

2. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 లోని సెక్షన్ 56 తో కలిపి, సబ్ సెక్షన్ (1), సెక్షన్ 35A క్రింద భారతీయ రిజర్వు బ్యాంకుకు ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, ఆగష్టు 31, 2016 నాటి ఆదేశం DCBS.CO.BSD-I/D-4/12.22.141/2016-17 ద్వారా డిసెంబర్ 31, 2019 వరకు చెల్లుబాటు ఐయ్యేలా, సమీక్షకు లోబడి పొడిగింపబడిన నిర్దేశాలను, డిసెంబర్ 20, 2019 నాటి ఆదేశం DOR.CO.AID./No.D-43/12.22.140/2019-20 ద్వారా జనవరి 01, 2020 నుండి మార్చ్ 31, 2020 వరకు మరో మూడు నెలల కాలానికి చెల్లుబాటు ఐయ్యేలా, సమీక్షకు లోబడి పొడిగించడమైనదిగా తెలియచేయడమైనది.

3. పై నిర్దేశాల ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పులు వుండవు. నిర్దేశాల పొడిగింపును తెలిపే డిసెంబర్ 20, 2019 నాటి ఆదేశం యొక్క ప్రతి, ఆసక్తిగల సభ్యుల పరిశీలన కోసం బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడినది.

4. పైన పేర్కొన్న నిర్దేశాల పొడిగింపు మరియు/లేదా సవరణలు, బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని భావించరాదు.

(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/1543

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?