RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78520058

శ్రీ ఆనంద్ సహకార బ్యాంక్ లిమిటెడ్, చించువాఁడ, పూణే, మహారాష్ట్ర – బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా), సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు (డైరెక్షన్స్)

తేది: 26/07/2019

శ్రీ ఆనంద్ సహకార బ్యాంక్ లిమిటెడ్, చించువాఁడ, పూణే, మహారాష్ట్ర – బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949
(సహకార సంఘాలకు వర్తించే విధంగా), సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు (డైరెక్షన్స్)

బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A(1) క్రింద ప్రదానం చేసిన అధికారాలను వినియోగించుకొని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సంతృప్తి చెందినదై, శ్రీ ఆనంద్ సహకార బ్యాంక్ లిమిటెడ్, చించువాఁడ, పూణే, మహారాష్ట్ర ఫై నిర్దేశాలు విధించాలని భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. తదనుసారముగా, జూన్ 25, 2019 పనివేళల ముగింపు నుండి శ్రీ ఆనంద్ సహకార బ్యాంక్ లిమిటెడ్, చించువాఁడ, పూణే, మహారాష్ట్ర; భారతీయ రిజర్వు బ్యాంకు నుండి ముందస్తు లిఖిత అనుమతి లేకుండా మరియు ఇక్కడ ఉదహరించిన పద్దతిలో తప్ప; ఎటువంటి రుణాలను మంజూరు చేయడం లేదా పునరుద్ధరించడం, ఏదైనా పెట్టుబడులను పెట్టడం, ఎటువంటి బాధ్యతను అంటే నిధులను అప్పుతెచ్చుకోవడం, తాజా డిపాజిట్లను ఆమోదించడం మరియు తన చెల్లింపు బాధ్యతల మొత్తాలనించి వేరే చెల్లింపుల పంపిణీకి వొడంబడటం లేదా ఏదైనా రాజీ లేక పరిష్కార ప్రయత్నాలు చేయడం, తన ఆస్తులను బదలాయించడం లేదా అమ్మడం మొదలగు కార్యకలాపాలు చేయరాదు.

i. ప్రతి డిపాజిటుదారు పొదుపు ఖాతా లేదా వాడుక ఖాతా లేదా మొత్తం డిపాజిట్ ఖాతా నుండి కేవలం 1000 (ఒక వేయి రూపాయలు మాత్రమే) మించని మొత్తం తీసుకోవచ్చు. ఆదేశాలలో పేర్కొన్న షరతులకు లోబడి, రుణగ్రహీతగా లేదా షూరిటీగా సందర్భాలలో, బ్యాంకు ఈ మొత్తాన్ని మొదట సంబంధిత రుణ ఖాతా/లకు సర్దుబాటు చేయవచ్చు.

ii. పరిపక్వమైన టర్మ్ డిపాజిట్లను అదే పేరుతో మరియు అదే సామర్థ్యంతో పునరుద్ధరించవచ్చు.

iii. క్రింది అవసరాలకు సంబంధించిన వాటికి బ్యాంకు ఖర్చు పెట్టవచ్చు.

ఎ. ఉద్యోగుల జీతాలు

బి. అద్దె, వడ్డీ మరియు పన్నులు

సి. విద్యుత్ బిల్లులు

డి. ప్రింటింగ్, స్టేషనరీ మొదలైనవి

ఇ. తపాలా మొదలైనవి

ఎఫ్. స్టాంప్ డ్యూటీ/రిజిస్ట్రేషన్ ఛార్జీలు/మధ్యవర్తిత్వ రుసుములతో కూడిన చట్టపరమైన ఖర్చులు. సంబంధిత చట్టాలు లేదా కోర్టు/ఆర్‌సిఎస్/డిఆర్‌టి నిబంధనలలో పేర్కొన్న రేట్ల ప్రకారం చెల్లించబడతాయి

జి. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా/చట్టాల నిబంధనల ప్రకారం కోర్టు రుసుము

హెచ్. ప్రతి కేసులో 5000/- (ఐదు వేల రూపాయలు మాత్రమే) మించని న్యాయవాదుల ఫీజు చెల్లింపు

iv. డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్‌ (DICGC) కు చెల్లించవలసిన ప్రీమియం చెల్లించవచ్చు

v. రోజువారీ పరిపాలనను కొనసాగించడానికి బ్యాంకు దృష్టిలో అవసరమైన ఏ పనికైనా ఖర్చు చేయవచ్చు. అయితే ఇది క్యాలెండర్ నెలలో ఏదైనా పనిపై మొత్తం ఖర్చు, సగటు నెలసరి మించకూడదు లేదా నిర్దేశం యొక్క తేదీకి ముందు ఆరునెలల వ్యవధిలో ఆ వస్తువు యొక్క ఖాతాపై ఖర్చు మించకూడదు. ఇంకా గతంలో ఆ వస్తువు కారణంగా ఎటువంటి వ్యయం చేయకపోతే, అది 1000/- (వెయ్యి రూపాయలు మాత్రమే) మించకూడదు.

vi. ప్రభుత్వ/ఎస్‌ఎల్‌ఆర్ ఆమోదించిన సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టవచ్చు.

vii. ప్రస్తుతమున్న బ్యాంకు సభ్యుల నుండి మూలధనానికి అందించే పెట్టుబడిని, ఆర్‌బిఐకి నెలవారీ ప్రాతిపదికన నివేదించే షరతుపై, అంగీకరించవచ్చు.

viii. పదవీ విరమణ చేసే ఉద్యోగులకు గ్రాట్యుటీ/ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలకు సంబంధించి చెల్లింపు చేయవచ్చు.

ix. ఆర్బిఐ ఆమోదంతో సెలవు నగదీకరణ/పదవీ విరమణ ప్రయోజనాలను, పదవీ విరమణ చేసిన/చేయబోయే ఉద్యోగులకు చెల్లించవచ్చు.

x. భారతీయ రిజర్వు బ్యాంకు నుండి ముందస్తు లిఖిత అనుమతి లేకుండా, మరే ఇతర బాధ్యతను చేపట్టరాదు/వదిలిపెట్టరాదు.

2. రుణగ్రహీతతో రుణ ఒప్పందం యొక్క నిబంధనలు మరియు షరతుల మేరకు నిర్దిష్ట డిపాజిట్ ఖాతాలోని మొత్తాన్ని (ఏ పేరుతో పిలిచినా), తన రుణాలు సర్దుబాటు చేయడానికి/కేటాయించడానికి బ్యాంకుకు అనుమతి ఉంది. రుణ ఖాతాలో బకాయిలు ఉన్నంత వరకు అటువంటి కేటాయింపు/సర్దుబాటు క్రింది షరతులకు లోబడి చేయవచ్చు:

ఎ. సర్దుబాటు తేదీ నాటికి ఖాతాలు KYC కి అనుగుణంగా ఉండాలి.

బి. హామీదారు/పూచీదారులతో సహా, మూడవ పక్షం వారి డిపాజిట్లు కూడా సర్దుబాటు చేయడానికి అనుమతించబడవు.

సి. సాధారణంగా మరింత ఆలస్యం జరిగి రుణ ఖాతా, నిరర్థక ఖాతా (ఎన్‌పిఎ) అయ్యే సందర్భాల్లో, డిపాజిటర్‌కు తగిన నోటీసు క్రింద ఈ ఎంపికను అమలు చేయాలి. ప్రామాణిక రుణాలు (క్రమం తప్పకుండా రుణ ఖాతా నిర్వహించడం) మరియు రుణ ఒప్పందం యొక్క నియమ నిబంధనల నుండి మార్పుకు, డిపాజిటర్-రుణగ్రహీత యొక్క ముందస్తు వ్రాతపూర్వక అనుమతి అవసరం.

డి. డిపాజిట్ లేదా దాని సెట్ ఆఫ్, కోర్ట్ అటాచ్మెంట్ ఆదేశం/నిషేధిత ఉత్తర్వు లేదా చట్టబద్ధమైన అధికారం లేదా చట్టం ప్రకారం అధికారం పొందిన ఇతర అధికారం, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, ట్రస్ట్ కు చెందినది, మూడవ పార్టీ తాత్కాలిక హక్కు, రాష్ట్ర సహకార సంఘాల చట్టం మొదలైన నిబంధనలకు కట్టుబడి ఉండకూడదు.

3. ఈ నిర్దేశం యొక్క ప్రతిలిపిని ప్రతి డిపాజిటర్‌కు బ్యాంక్ ద్వారా పంపే ఏర్పాటు చేయాలి మరియు బ్యాంక్ వెబ్‌సైట్ హోమ్ పేజీలో కూడా ప్రదర్శించాలి.

4. భారతీయ రిజర్వు బ్యాంకు సూచించిన విధంగా లేక కోరిన విధంగా తన కార్యకలాపాలకు సంబంధించిన తగు స్టేట్మెంట్లను, చీఫ్ జనరల్ మేనేజర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సహకార బ్యాంక్ పర్యవేక్షణ విభాగం, ముంబై ప్రాంతీయ కార్యాలయం, సి -8, గ్రౌండ్ ఫ్లోర్‌, బాంద్రా కుర్లా కాంప్లెక్స్, ముంబై-400051కు, శ్రీ ఆనంద్ సహకార బ్యాంక్ లిమిటెడ్, చించువాఁడ, పూణే, మహారాష్ట్ర సమర్పించాలని ఆదేశించడమైనది.

5. ఈ నిర్దేశాలు జూన్ 25, 2019 పని వేళలు ముగిసినప్పటి నుండి ఆరు నెలల కాలానికి, సమీక్షకు లోబడి, అమలులో ఉంటాయి.

యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/253

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?