RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78516377

మరాఠా సహకారి బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర – బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు), సెక్షన్‌ 35 A (సెక్షన్ 56 తో కలిపి) క్రింద నిర్దేశాలు - గడువు పొడిగింపు

తేదీ: 30/07/2020

మరాఠా సహకారి బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర – బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు),
సెక్షన్‌ 35 A (సెక్షన్ 56 తో కలిపి) క్రింద నిర్దేశాలు - గడువు పొడిగింపు

ఆగస్ట్ 31, 2016 తేదీ జారీచేసిన DCBS.CO.BSD-1/D-4/12.22.141/2016-17 ఆదేశాలద్వారా, మరాఠా సహకారి బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర, ఆగస్ట్ 31, 2016 పని ముగింపు వేళల నుండి, ఆరు నెలల పాటు నిర్దేశాల పరిధిలోకి తేబడినది. ఆ నిర్దేశాల గడువు, తదుపరి అదేశాల ద్వారా ఎప్పటికప్పుడు పొడిగించడం జరిగింది. మార్చి 18, 2020 తేదీన జారీ చేసిన చివరి ఆదేశం DOR.CO.AID.No.D-62/12.22.140/2019-20 ద్వారా, జులై 31, 2020 వరకు సమీక్షకులోబడి, గడువు పొడిగించబడింది.

2. రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు), సబ్-సెక్షన్‌ (1), సెక్షన్‌ 35 A (సెక్షన్‌ 56తో సహా), ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలు వినియోగించి, పైన పేర్కొన్న బ్యాంకుకు ఆగస్ట్ 31, 2016 తేదీ DCBS.CO.BSD-1/D-4/12.22.141/2016-17 ద్వారా జారీ చేయబడి, ఆ తరువాత ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివరిసారి జులై 31, 2020 వరకు పొడిగించబడ్డ నిర్దేశాలు, మరొక ఐదు నెలలు (అనగా ఆగస్ట్ 01, 2020 నుండి డిసెంబర్ 31, 2020 వరకు) బ్యాంకుకు వర్తిస్తాయని, DOR.CO.AID.No.D-7/12.22.140/2020-21, జులై 27, 2020 ద్వారా అదేశించడం జరిగిందని, ప్రజలకు తెలియజేయడమైనది. ఈ ఆదేశాలు తిరిగి సమీక్షించ వచ్చు.

3. పైన తెలిపిన నిర్దేశాలలోని ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పూ లేదు.

4. కాలపరిమితి పెంచుతూ, జులై 27,2020 తేదీన జారీచేసిన ఆదేశాల ప్రతి, మరాఠా సహకారి బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర ఆవరణలో, ప్రజల సమాచారార్ధం, ప్రదర్శించబడినది.

5. పైన తెలిపిన కాలపరిమితి పొడిగింపు మరియు / లేక మార్పులు చేసినంతమాత్రాన, బ్యాంకుయొక్క ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడిందని రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందినట్లుగా, ఏ మాత్రమూ భావించరాదు.

(యోగేశ్ దయాల్) 
చీఫ్ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2020-2021/115

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?