<font face="mangal" size="3">బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్), సెక్షన - ఆర్బిఐ - Reserve Bank of India
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్), సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35 ఎ క్రింద నిర్దేశాలు – ది సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర – కాలపరిమితి పొడిగింపు
ఏప్రిల్ 15, 2020 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్), సెక్షన్ 56 తో ది సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై, ఏప్రిల్ 17, 2018 తేదీ నాటి ఆదేశం DCBS/CO.BSD-I/D-5/12.22.039/2017-18 ద్వారా, ఏప్రిల్ 17, 2018 తేదీ పనివేళల ముగింపు నుండి ఆరు మాసాలపాటు ఆర్బీఐ నిర్దేశాల క్రింద ఉంచబడింది. ఈ నిర్దేశాల వర్తింపు ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ క్రితం పర్యాయం అక్టోబర్ 15, 2019 తేదీ నాటి ఆదేశం DCBR.CO.AID/No.D-27/12.22.039/2019-20 ద్వారా, ఏప్రిల్ 17, 2020 తేదీ వరకు పొడిగించబడినది. 2. జనావళి సమాచారం నిమిత్తం తెలియజేయడం ఏమిటంటే - భారతీయ రిజర్వు బ్యాంకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) , సెక్షన్ 56 తో కలిపి, సబ్-సెక్షన్ (1) సెక్షన్ 35 ఎ ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో ది సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై కు ఏప్రిల్ 17, 2018 తేదీ న జారీచేసిన డైరెక్టివ్ DCBS/CO.BSD-I/D-5/12.22.039/2017-18 చెల్లుబాటు, ఎప్పటికప్పుడు సవరింపబడుతూ ఇంతకుముందు ఏప్రిల్ 17, 2020 వరకు పొడిగింపబడి, మరో మూడు మాసాలబాటు ఏప్రిల్ 17, 2020 నుండి జులై 16, 2020 వరకు వర్తింపు కొనసాగుతుందని, సమీక్షకు లోబడి ఏప్రిల్ 07, 2020 తేదీ డైరెక్టివ్ DOR.CO.AID No.D-68/12.22.039/2019-20 ద్వారా ఇందుమూలంగా నిర్దేశించారు. 3. పైన ఉటంకించిన ఆదేశాలలోని అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులలో ఎటువంటిమార్పు లేదు. 4. ఏప్రిల్ 07, 2020 తేదీ నాటి పొడిగింపు ఆదేశం నకలు ప్రజల పరిశీలనార్ధం బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడింది. 5. భారతీయ రిజర్వు బ్యాంకు చే పైన పేర్కొన్న ఆదేశాల పొడిగింపు మరియు / లేదా సవరణ ను, బ్యాంక్ యొక్క ఆర్ధిక పరిస్థితి చెప్పుకోదగిన విధంగా మెరుగుపడిందని భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తిచెందిందనిగా అన్యధా పరిగణించరాదు. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/2220 |