<font face="mangal" size="3">ది సిటీ కో -ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ - ఆర్బిఐ - Reserve Bank of India
ది సిటీ కో -ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర –బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు), సెక్షన్ 35 A (సెక్షన్ 56 తో కలిపి) క్రింద నిర్దేశాలు - గడువు పొడిగింపు
తేదీ: 15/07/2020 ది సిటీ కో -ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర –బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు), సెక్షన్ 35 A (సెక్షన్ 56 తో కలిపి) క్రింద నిర్దేశాలు - గడువు పొడిగింపు ఏప్రిల్ 17, 2018 తేదీ జారీచేసిన DCBS.CO.BSD-1/D-5/12.22.039/2017-18 ఆదేశాలద్వారా, ది సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర, ఏప్రిల్ 17, 2018 పని ముగింపు వేళల నుండి, ఆరు నెలల పాటు నిర్దేశాల పరిధిలోకి తేబడినది. ఆ నిర్దేశాల గడువు, తదుపరి అదేశాల ద్వారా ఎప్పటికప్పుడు పొడిగించడం జరిగింది. ఏప్రిల్ 07, 2020 తేదీన జారీ చేసిన చివరి ఆదేశం DOR.CO.AID. No.D-68/12.22.039/2019-20 ద్వారా, జులై 16, 2020 వరకు సమీక్షకులోబడి, గడువు పొడిగించబడింది. 2. రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు), సబ్-సెక్షన్ (1), సెక్షన్ 35 A (సెక్షన్ 56తో సహా), ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలు వినియోగించి, పైన పేర్కొన్న బ్యాంకుకు ఏప్రిల్ 17, 2018 తేదీ DCBS.CO.BSD-1/D-5/12.22.039/2017-18 ద్వారా జారీ చేయబడి, ఆ తరువాత ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివరిసారి జులై 16, 2020 వరకు పొడిగించబడ్డ నిర్దేశాలు, మరొక మూడు నెలలు (అనగా జులై 17, 2020 నుండి అక్టోబర్ 16, 2020 వరకు) బ్యాంకుకు వర్తిస్తాయని, DOR.CO.AID.No.D-3/12.22.039/2020-21, జులై 10, 2020 ద్వారా అదేశించడం జరిగిందని, ప్రజలకు తెలియజేయడమైనది. ఈ ఆదేశాలు తిరిగి సమీక్షించవచ్చు. 3. పైన తెలిపిన నిర్దేశాలలోని ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పూ లేదు. 4. కాలపరిమితి పెంచుతూ, జులై 10, 2020 తేదీన జారీచేసిన ఆదేశాల ప్రతి, ది సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర ఆవరణలో, ప్రజల సమాచారార్ధం, ప్రదర్శించబడినది. 5. పైన తెలిపిన కాలపరిమితి పొడిగింపు మరియు / లేక మార్పులు చేసినంతమాత్రాన, బ్యాంకుయొక్క ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడిందని రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందినట్లుగా, ఏ మాత్రమూ భావించరాదు. (యోగేశ్ దయాల్) పత్రికా ప్రకటన: 2020-2021/57 |