<font face="mangal" size="3">ది కపోల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారా - ఆర్బిఐ - Reserve Bank of India
ది కపోల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర – బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు), సెక్షన్ 35 A (సెక్షన్ 56 తో కలిపి) క్రింద నిర్దేశాలు - గడువు పొడిగింపు
తేదీ: 30/07/2020 ది కపోల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర – బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు), మార్చి 30, 2017 తేదీ జారీచేసిన DCBS.CO.BSD-I/D-9/12.22.111/2016-17 ఆదేశాలద్వారా, ది కపోల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర, మార్చి 30, 2017 పని ముగింపు వేళల నుండి, నిర్దేశాల పరిధిలోకి తేబడినది. ఆ నిర్దేశాల గడువు, తదుపరి అదేశాల ద్వారా ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, జనవరి 29, 2020 తేదీన జారీ చేసిన చివరి ఆదేశం DOR.CO.AID.No.D-53/12.22.111/2019-20 ద్వారా, జులై 31, 2020 వరకు సమీక్షకులోబడి, పొడిగించబడింది. 2. రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు), సబ్-సెక్షన్ (1), సెక్షన్ 35 A (సెక్షన్ 56తో సహా), ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలు వినియోగించి, పైన పేర్కొన్న బ్యాంకుకు మార్చి 30, 2017 తేదీ DCBS.CO.BSD-1/D-9/12.22.111/2016-17 ద్వారా జారీ చేయబడి, ఆ తరువాత ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివరిసారి జులై 31, 2020 వరకు పొడిగించబడ్డ నిర్దేశాలు, మరొక ఆరు నెలలు (అనగా ఆగస్ట్ 01, 2020 నుండి జనవరి 31, 2021 వరకు) బ్యాంకుకు వర్తిస్తాయని, DOR.CO.AID.No.D-9/12.22.111/2020-21, తేదీ జులై 27, 2020 ద్వారా అదేశించడం జరిగిందని, ప్రజలకు తెలియజేయడమైనది. ఈ ఆదేశాలు తిరిగి సమీక్షించ వచ్చు. 3. పైన తెలిపిన నిర్దేశాలలోని ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పూ లేదు. 4. కాలపరిమితి పెంచుతూ, జులై 27, 2020 తేదీన జారీచేసిన ఆదేశాల ప్రతి, ది కపోల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర ఆవరణలో, ప్రజల సమాచారార్ధం, ప్రదర్శించబడినది. 5. పైన తెలిపిన కాలపరిమితి పొడిగింపు మరియు / లేక మార్పులు చేసినంతమాత్రాన, బ్యాంకుయొక్క ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడిందని రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందినట్లుగా, ఏ మాత్రమూ భావించరాదు. (యోగేశ్ దయాల్) పత్రికా ప్రకటన: 2020-2021/118 |