<font face="mangal" size="3">బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్), సెక్షన - ఆర్బిఐ - Reserve Bank of India
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్), సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35 ఎ క్రింద నిర్దేశాలు – ది కరాడ్ జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్, కరాడ్, మహారాష్ట్ర – కాలపరిమితి పొడిగింపు
జూన్ 09, 2020 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్), సెక్షన్ 56 తో ది కరాడ్ జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్, కరాడ్, నవంబర్ 7, 2017 తేదీ నాటి ఆదేశం DCBS/CO.BSD-I/D-4/12.22.126/2017-18 ద్వారా, నవంబర్ 9, 2017 తేదీ పనివేళల ముగింపు నుండి ఆరు మాసాలపాటు ఆర్బీఐ నిర్దేశాల క్రింద ఉంచబడింది. ఈ నిర్దేశాల వర్తింపు ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ క్రితం పర్యాయం మార్చి 4, 2020 తేదీ నాటి ఆదేశం DCBR.CO.AID/No.D-59/12.22.126/2018-19 ద్వారా, జూన్ 29, 2020 తేదీ వరకు పొడిగించబడినది. 2. జనావళి సమాచారం నిమిత్తం తెలియజేయడం ఏమిటంటే - భారతీయ రిజర్వు బ్యాంకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) , సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35 ఎ (1) ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో ది కరాడ్ జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్, కరాడ్ కు నవంబర్ 7, 2017 తేదీ న జారీచేసిన డైరెక్టివ్ DCBR.CO.AID/No.D-4/12.22.126/2017-18 చెల్లుబాటు, ఎప్పటికప్పుడు సవరింపబడుతూ ఇంతకుముందు జూన్ 9, 2020 వరకు పొడిగింపబడి, మరో మూడు మాసాలబాటు అంటే జూన్ 10, 2020 నుండి సెప్టెంబర్ 9, 2020 వరకు వర్తింపు కొనసాగుతుందని, సమీక్షకు లోబడి జూన్ 03, 2020 తేదీ డైరెక్టివ్ DCBR.CO.AID No.D-84/12.22.126/2019-20 ద్వారా ఇందుమూలంగా నిర్దేశించారు. 3. పైన ఉటంకించిన ఆదేశాలలోని అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులలో ఎటువంటిమార్పు లేదు. 4. జూన్ 03, 2020 తేదీ నాటి పొడిగింపు ఆదేశం నకలు ప్రజల పరిశీలనార్ధం బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడింది. 5. భారతీయ రిజర్వు బ్యాంకు చే పైన పేర్కొన్న ఆదేశాల పొడిగింపు మరియు / లేదా సవరణ ను, బ్యాంక్ యొక్క ఆర్ధిక పరిస్థితి చెప్పుకోదగిన విధంగా మెరుగుపడిందని భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తిచెందిందనిగా అన్యధా పరిగణించరాదు. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/2473 |