RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78516891

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది), సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు – ది కరాడ్ జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్, కరాడ్, మహారాష్ట్ర - నిర్దేశాల కాలపరిమితి పొడిగింపు

సెప్టెంబర్ 08, 2020

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది), సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A క్రింద
నిర్దేశాలు – ది కరాడ్ జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్, కరాడ్, మహారాష్ట్ర - నిర్దేశాల కాలపరిమితి పొడిగింపు

నవంబర్ 07, 2017 నాటి భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశం DCBS.CO.BSD-1/D-4/12.22.126/2017-18 ప్రకారం, ది కరాడ్ జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్, కరాడ్, నవంబర్ 09, 2017 పనివేళల ముగింపు నుండి ఆరు నెలల కాలానికి నిర్దేశాల క్రింద ఉంచబడింది. సమయానుసారంగా అట్టి నిర్దేశాలను తదుపరి ఆదేశాలతో భారతీయ రిజర్వు బ్యాంకు పొడిగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో చివర ఇచ్చిన జూన్ 03, 2020 నాటి ఆదేశం DOR.CO.AID/No.D-84/12.22.126/2019-20 ప్రకారం అట్టి నిర్దేశం సెప్టెంబర్ 09, 2020 వరకు పొడిగింపబడింది.

2. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది), సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A (1) క్రింద ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుని, నవంబర్ 07, 2017 నాటి భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశం DCBS.CO.BSD-1/D-4/12.22.126/2017-18 ద్వారా ది కరాడ్ జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్, కరాడ్, ఫై జారీచేయబడిన మరియు సమయానుసారంగా పొడిగిస్తూ, చివరిసారిగా సెప్టెంబర్ 09, 2020 వరకు పొడిగింపబడిన నిర్దేశం మరో మూడు నెలల కాలానికి అంటే సెప్టెంబర్ 10, 2020 నుండి డిసెంబర్ 09, 2020 వరకు భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జారీ చేయబడిన సెప్టెంబర్ 03, 2020 నాటి ఆదేశం DOR.CO.AID/No.D-19/12.22.126/2020-21 ద్వారా, సమీక్షకు లోబడి అమలులో ఉంటుందని ప్రజా సూచనార్ధం తెలియజేయడమైనది.

3. పైన ఉటంకించిన ఆదేశాలలోని అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులు మార్పు లేకుండా యథా తథంగా ఉంటాయి.

4. సెప్టెంబర్ 03, 2020 న జారీ చేసిన పొడిగింపబడిన ఆదేశం యొక్క నకలు బ్యాంకు ప్రాంగణంలో, ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడుతుంది.

5. పైన పేర్కొన్న పొడిగింపు మరియు/లేదా సవరణ, బ్యాంక్ యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల, భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని అన్వయించుకోరాదు.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన : 2020-2021/300

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?