RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

104372697

నగర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అహ్మద్‌నగర్ - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది), సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు - కాలపరిమితి పొడిగింపు

తేది: 06/03/2023

నగర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అహ్మద్‌నగర్ -
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది),
సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు - కాలపరిమితి పొడిగింపు

డిసెంబర్ 06, 2021 నాటి ఆదేశం DoS.CO.SUCBs-West/S2399/12.22.159/2021-22 ప్రకారం నగర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అహ్మద్‌నగర్ డిసెంబర్ 06, 2021 పనివేళలు ముగింపు నుండి ఆరు నెలల కాలానికి నిర్దేశాల క్రింద ఉంచబడింది. అట్టి నిర్దేశాల కాలపరిమితిని సమయానుసారంగా పొడిగిస్తూ, చివరిగా మార్చ్ 06, 2023 వరకు చెల్లుబాటు ఐయ్యేలా, సమీక్షకు లోబడి పొడిగించడమైనది.

2. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 56 తో కలిపి, సబ్ సెక్షన్ (1), సెక్షన్ 35A క్రింద భారతీయ రిజర్వు బ్యాంకుకు ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, అట్టి నిర్దేశాలు, మార్చ్ 06, 2023 నాటి ఆదేశం DOR.MON.D-81/12.22.159/2022-23 ప్రకారం జూన్ 06, 2023 వరకు చెల్లుబాటు ఐయ్యేలా, సమీక్షకు లోబడి పొడిగించబడ్డాయని తెలియచేయడమైనది.

3. పై నిర్దేశాల ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పులు వుండవు. నిర్దేశాల పొడిగింపును తెలిపే మార్చ్ 06, 2023 నాటి ఆదేశం యొక్క ప్రతి, ఆసక్తిగల సభ్యుల పరిశీలన కోసం బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడినది.

4. పైన పేర్కొన్న నిర్దేశాల పొడిగింపు మరియు/లేదా సవరణలు, బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని అన్వయించుకోరాదు.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2022-2023/1838

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?