<font face="mangal" size="3">కర్నాల నగరి సహకార బ్యాంకు లిమిటెడ్, పన్వేల్, &# - ఆర్బిఐ - Reserve Bank of India
కర్నాల నగరి సహకార బ్యాంకు లిమిటెడ్, పన్వేల్, రాయగఢ్, మహారాష్ట్ర ఫై
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 56 తో కలిపి
తేది: 15/12/2020 కర్నాల నగరి సహకార బ్యాంకు లిమిటెడ్, పన్వేల్, రాయగఢ్, మహారాష్ట్ర ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జూన్ 15, 2020 నాటి ఆదేశం DoS.CO.UCBs-West/D-1/12.07.157/2019-20 ద్వారా, కర్నాల నగరి సహకార బ్యాంకు లిమిటెడ్, పన్వేల్, రాయగఢ్, మహారాష్ట్ర ను జూన్ 15, 2020 పని వేళల ముగింపు నుండి ఆరు నెలల కాలానికి నిర్దేశాల క్రింద ఉంచింది. 2. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A (1) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, కర్నాల నగరి సహకార బ్యాంకు లిమిటెడ్, పన్వేల్, రాయగఢ్, మహారాష్ట్ర ఫై జూన్ 15, 2020 పని వేళల ముగింపు నుండి ఆరు నెలల కాలానికి విధించిన నిర్దేశాలు, డిసెంబర్ 14, 2020 నాటి ఆదేశం DOR.AID/D-43/12.22.365/2020-21 ద్వారా జూన్ 15, 2021 వరకు సమీక్షకు లోబడి, అమలులో వుంటాయని భారతీయ రిజర్వు బ్యాంకు ప్రజలకు తెలియజేస్తుంది. 3. పైన సూచించిన ఆదేశాల యొక్క ఇతర నిబంధనలు మరియు షరతులు మారవు. నిర్దేశాల కాల పరిమితి పొడిగింపును సూచించే ఆదేశం యొక్క నకలు, బ్యాంకు ప్రాంగణంలో ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది. 4. పైన పేర్కొన్న నిర్దేశాల పొడిగింపు మరియు/లేదా సవరణలు బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని భావించరాదు. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2020-2021/775 |