<font face="mangal" size="3">మడఁగావ్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, మార్గోవĹ - ఆర్బిఐ - Reserve Bank of India
మడఁగావ్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, మార్గోవా, గోవా - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు - కాలపరిమితి పొడిగింపు మరియు ఉపసంహరణ పరిమితిలో సడలింపు
తేది: 31/10/2019 మడఁగావ్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, మార్గోవా, గోవా - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని ఏప్రిల్ 26, 2019 నాటి DCBS.CO.BSD-I/D-13/12.22.158/2018-19 ఆదేశం ద్వారా, మే 02, 2019 పనివేళలు ముగింపు నుండి నవంబర్ 02, 2019 వరకు మడఁగావ్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, మార్గోవా, గోవా ఫై భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశాలు విధించింది. ప్రస్తుత నిర్దేశాల ప్రకారం, ఇతర షరతులతో పాటు, ప్రతి పొదుపు లేదా వాడుక ఖాతా లేదా మరే ఇతర డిపాజిట్ ఖాతాలోని మొత్తం మిగులులో ₹ 5,000/- మించని మొత్తాన్ని డిపాజిటర్ ఉపసంహరించుకునేందుకు అనుమతించబడుతుంది. బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిని సమీక్షించిన తరువాత, ప్రజా ప్రయోజనం దృష్ట్యా పైన పేర్కొన్న నిర్దేశాలలో సవరణలు అవసమని భారతీయ రిజర్వు బ్యాంకు పరిగణించింది. తదనుసారంగా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A(1)&(2) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని మడఁగావ్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, మార్గోవా, గోవా ఫై ఏప్రిల్ 26, 2019 నాటి ఆదేశం DCBS.CO.BSD-I/D-13/12.22.158/2018-19 ద్వారా విధించిన నిర్దేశాలలోని పేరా 1(i)ను క్రింది విధంగా సవరించింది: i. “ప్రతి డిపాజిటుదారు పొదుపు ఖాతా లేదా వాడుక ఖాతా లేదా మొత్తం డిపాజిట్ ఖాతా (ఏ పేరుతొ పిలిచినా) నుండి కేవలం ₹ 30,000/- (ముప్పై వేల రూపాయలు మాత్రమే) మించని మొత్తం తీసుకోవచ్చు. అయితే ఖాతాదారు రుణగ్రహీతగా లేదా షూరిటీగా మరియు డిపాజిట్ల ఫై రుణాలు తీసుకున్న సందర్భాలతో సహా, బ్యాంకు ఈ మొత్తాన్ని మొదట సంబంధిత రుణ ఖాతా/లకు సర్దుబాటు చేయవచ్చు”. డిపాజిటర్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని బ్యాంక్ ఎస్క్రో ఖాతాలో మరియు / లేదా కేటాయించిన సెక్యూరిటీలలో విడిగా ఉంచాలి, ఇది సవరించిన ఆదేశాల ప్రకారం డిపాజిటర్లకు చెల్లించడానికి మాత్రమే బ్యాంక్ ఉపయోగించాలి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సంతృప్తి చెందినదై, ఏప్రిల్ 26, 2019 నాటి DCBS.CO.BSD-I/D-13/12.22.158/2018-19 ఆదేశం ద్వారా మడఁగావ్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, మార్గోవా, గోవా ఫై విధించిన నిర్దేశాల కార్యకలాపాల పరిధిని పెంచాలని భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. తదనుసారంగా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని మడఁగావ్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, మార్గోవా, గోవా ఫై అమలులో వున్న ఏప్రిల్ 26, 2019 నాటి ఆదేశం DCBS.CO.BSD-I/D-13/12.22.158/2018-19, మరో ఆరు నెలల కాలానికి నవంబర్ 02, 2019 నుండి మే 02, 2020 వరకు సమీక్షకు లోబడి, అమలులో వుంటాయని భారతీయ రిజర్వు బ్యాంకు తెలియజేస్తుంది. పై నిర్దేశాల ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పులు వుండవు. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/1063 |