<font face="mangal" size="3px">సెక్షన్ 56 తో కలిపి సెక్షన్‌ 35 A, బ్యాంకింగ్ నియం - ఆర్బిఐ - Reserve Bank of India
సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 క్రింద నిర్దేశాలు - రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పుణే, మహారాష్ట్ర - కాలపరిమితి పొడిగింపు
తేదీ: ఆగష్టు 31, 2021 సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ భారతీయ రిజర్వు బ్యాంకు, ఫిబ్రవరి 21, 2013 నాటి ఆదేశం UBD.CO.BSD-I/D-28/12.22.2018/2012-13 ద్వారా రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పుణే, మహారాష్ట్ర ను, ఫిబ్రవరి 22, 2013 వ తేదీ పనివేళల ముగింపు నుండి నిర్దేశాల క్రింద ఉంచింది. ఆ నిర్దేశాల గడువు, తదుపరి అదేశాల ద్వారా ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివరిసారి ఆగష్టు 31, 2021 వరకు పొడిగించబడింది. 2. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A (1) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, పైన ఉటంకించిన నిర్దేశాలు నవంబర్ 30, 2021 తేదీవరకు, ఆగష్టు 27, 2021 నాటి తమ ఆదేశం DOR.MON/D-31/12.22.218/2021-22 ద్వారా సమీక్షకు లోబడి, అమలులో వుంటాయని భారతీయ రిజర్వు బ్యాంకు తెలియజేస్తున్నది. 3. పైన సూచించిన ఆదేశాల యొక్క ఇతర నిబంధనలు మరియు షరతులు మారవు. నిర్దేశాల కాల పరిమితి పొడిగింపును సూచించే ఆగష్టు 27, 2021 తేదీ నాటి ఆదేశం యొక్క నకలు, బ్యాంక్ ప్రాంగణంలో ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది. 4. పైన పేర్కొన్న నిర్దేశాల పొడిగింపు మరియు/లేదా సవరణలు బ్యాంక్ యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని భావించరాదు. (యోగేశ్ దయాల్) పత్రికా ప్రకటన: 2021-2022/780 |