<font face="mangal" size="3px">సెక్షన్ 56 తో కలిపి సెక్షన్‌ 35 A, బ్యాంకింగ్ నియం - ఆర్బిఐ - Reserve Bank of India
సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 క్రింద నిర్దేశాలు - సర్జేరావ్ దాదా నాయిక్ షిరాల సహకారి బ్యాంక్ లి., షిరాల, సాంగ్లీ జిల్లా, మహారాష్ట్ర - కాలపరిమితి పొడిగింపు
తేదీ: ఆగష్టు 03, 2021 సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ భారతీయ రిజర్వు బ్యాంకు, ఫిబ్రవరి 03, 2021 నాటి ఆదేశం DOS.CO.UCBs-వెస్ట్-/D-1/12.07.157/2020-21 ద్వారా సర్జేరావ్ దాదా నాయిక్ షిరాల సహకారి బ్యాంక్ లి., షిరాల, సాంగ్లీ జిల్లా, మహారాష్ట్ర ను, ఫిబ్రవరి 03, 2021 వ తేదీ పనివేళల ముగింపు నుండి ఆరు మాసాల పాటు నిర్దేశాల క్రింద ఉంచింది. 2. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A (1) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, పైన ఉటంకించిన నిర్దేశాలు నవంబర్ 03, 2021 తేదీ వరకు, ఆగష్టు 02, 2021 నాటి తమ ఆదేశం DOR.MON/D-25/12.07.157/2021-22 ద్వారా సమీక్షకు లోబడి, అమలులో వుంటాయని భారతీయ రిజర్వు బ్యాంకు తెలియజేస్తున్నది. 3. పైన సూచించిన ఆదేశం యొక్క ఇతర నిబంధనలు మరియు షరతులు మారవు. నిర్దేశం కాల పరిమితి పొడిగింపును సూచించే ఆగష్టు 02, 2021 తేదీ నాటి ఆదేశం యొక్క నకలు, బ్యాంక్ ప్రాంగణంలో ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది. 4. పైన పేర్కొన్న నిర్దేశాల పొడిగింపు మరియు/లేదా సవరణలు బ్యాంక్ యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని భావించరాదు. (యోగేశ్ దయాల్) పత్రికా ప్రకటన: 2021-2022/631 |