RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78529070

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు (డైరెక్షన్స్) - శ్రీ ఆనంద్ సహకార బ్యాంక్ లిమిటెడ్, చించ్‌వాడ్, పూణే, మహారాష్ట్ర - వ్యవధి పొడిగింపు

తేది: 24/09/2021

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 56తో కలిపి,
సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు (డైరెక్షన్స్) - శ్రీ
ఆనంద్ సహకార బ్యాంక్ లిమిటెడ్, చించ్‌వాడ్, పూణే,
మహారాష్ట్ర - వ్యవధి పొడిగింపు

భారతీయ రిజర్వు బ్యాంకు, జూన్ 21, 2019 నాటి DCBS.CO.BSD-I/D-16/12.22.474/2018-19 ఆదేశానుసారం, శ్రీ ఆనంద్ సహకార బ్యాంక్ లిమిటెడ్, చించ్‌వాడ్, పూణే, మహారాష్ట్రను జూన్ 25, 2019 పని వేళల ముగింపు నుండి ఆరు నెలల కాలానికి నిర్దేశాల క్రింద ఉంచింది. నిర్దేశాల వ్యవధి కాలానుగుణంగా పెంచుతూ, చివరి సారిగా సెప్టెంబర్ 24, 2021 వరకు పొడిగించబడింది.

2. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 35A యొక్క సబ్ సెక్షన్ (1) లో ఉన్న అధికారాలను వినియోగించుకుని, సెప్టెంబర్ 23, 2021 నాటి DOR.MON.D-37/12.22.474/2021-22 ఆదేశానుసారం పైన పేర్కొన్న అట్టి నిర్దేశాలు, సమీక్షకు లోబడి, నవంబర్ 24, 2021 వరకు బ్యాంక్‌కి వర్తిస్తాయని ప్రజలకు తెలియజేయడమైనది.

3. పైన సూచించబడిన నిర్దేశాల ఇతర నిబంధనలు మరియు షరతులలో మార్పులేదు. సెప్టెంబర్ 23, 2021న జారీ చేసిన పొడిగింపబడిన నిర్దేశం యొక్క ప్రతి, బ్యాంకు ప్రాంగణంలో ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది.

4. భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా పొడిగింపబడిన/మార్పుచేయబడిన ఫై నిర్దేశాలను, బ్యాంక్ యొక్క ఆర్ధిక స్థితిలో మెరుగుదలగా భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తి పడినట్లు అన్వయించుకోరాదు.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2021-2022/928

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?