ది కపోల్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35 A క్రింద నిర్దేశాలు - కాలపరిమితి పొడిగింపు
తేది: 01/11/2021 ది కపోల్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర - భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా మార్చ్ 30, 2017 నాటి ఆదేశం DCBS.CO.BSD-I./D-9/12.22.111/2016-17 ప్రకారం, ది కపోల్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్రన, మార్చ్ 30, 2017 పనివేళలు ముగింపు నుండి ఆరు నెలల కాలానికి, నిర్దేశాల క్రింద ఉంచబడింది. కాలానుగుణంగా పెంచుతూ, నిర్దేశాల వ్యవధి చివరి సారిగా అక్టోబర్ 31, 2021 వరకు పొడిగింపబడింది. 2. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 56 తో కలిపి, సబ్ సెక్షన్ (1), సెక్షన్ 35A క్రింద భారతీయ రిజర్వు బ్యాంకుకు ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, అక్టోబర్ 27, 2021 నాటి ఆదేశం DOR.MON.D-43/12.22.111/2021-22 ద్వారా విధించబడిన అట్టి నిర్దేశాలు, సమీక్షకు లోబడి ఏప్రిల్ 30, 2022 వరకు బ్యాంక్‌కి వర్తిస్తాయని ప్రజలకు తెలియజేయడమైనది. 3. పైన సూచించబడిన నిర్దేశాల ఇతర నిబంధనలు మరియు షరతులలో మార్పులేదు. నిర్దేశాల పొడిగింపును తెలిపే అక్టోబర్ 27, 2021 నాటి ఆదేశం యొక్క ప్రతి, ప్రజా వీక్షణార్ధం బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడినది. 4. భారతీయ రిజర్వుబ్యాంకు ద్వారా పొడిగింపబడిన/మార్పుచేయబడిన ఫై నిర్దేశాలను, బ్యాంక్ యొక్క ఆర్ధిక స్థితిలో మెరుగుదలగా భారతీయ రిజర్వుబ్యాంకు సంతృప్తి పడినట్లుగా అన్వయించుకోరాదు. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2021-2022/1125 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: