<font face="mangal" size="3">యూత్ డెవెలప్మెంట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి.,కొ - ఆర్బిఐ - Reserve Bank of India
యూత్ డెవెలప్మెంట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి.,కొల్హాపూర్, మహారాష్ట్ర – బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 35 A (సెక్షన్ 56 తో కలిపి), క్రింద నిర్దేశాల జారీ – ఖాతాదారులకు విత్ డ్రావల్ (ఉపసంహరణ) పరిమితి పెంపు
తేదీ: 19/06/2020 యూత్ డెవెలప్మెంట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి.,కొల్హాపూర్, మహారాష్ట్ర – బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 35 A (సెక్షన్ 56 తో కలిపి), క్రింద నిర్దేశాల జారీ – ఖాతాదారులకు విత్ డ్రావల్ (ఉపసంహరణ) పరిమితి పెంపు ఖాతాదారుల రక్షణకొరకు, రిజర్వ్ బ్యాంక్, వారి ఆదేశాలు DCBS.CO.BSD-I/D-6/12.22.311/2018-19, తేదీ జనవరి 04, 2019 ద్వారా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సబ్ సెక్షన్ 1, సెక్షన్ 35 A (సెక్షన్ 56 తో కలిపి) క్రింద, యూత్ డెవెలప్మెంట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి.,కొల్హాపూర్, మహారాష్ట్రకు, సమగ్ర నిర్దేశాలు జారీచేసినది. జనవరి 05, 2019 పని ముగింపు వేళనుండి అమలులోకివచ్చిన ఈనిర్దేశాల క్రింద, విత్ డ్రావల్ పై పరిమితి రూ. 5,000/-. బ్యాంకు లిక్విడిటీ పరిస్థితి మరియు డిపాజిటర్లకు చెల్లించగల సామర్థ్యం సమీక్షించి, వారి నిర్దేశాలు DOR.CO.AID No. D-90/12.22.311/2019-20 తేదీ జూన్ 19, 2020 ద్వారా, విత్డ్రావల్ పరిమితిని రూ.20,000/- (రూపాయిలు ఇరవై వేలు)కు పెంచాలని నిర్ణయించడం జరిగింది (ముందు అనుమతించిన రూ.5,000/- తో కలిపి). ఈ సడలింపుతో, బ్యాంకు ఖాతాదారులలో 76% మంది వారి పూర్తి నిల్వ విత్ డ్రా చేయగలరు. పైన పేర్కొన్న ఆదేశంలోని అన్ని ఇతర నియమ నిబంధనలలో (తదుపరిచేసిన మార్పులతో సహా) ఎట్టి మార్పూ లేదు. (యోగేశ్ దయాల్) పత్రికా ప్రకటన: 2019-2020/2527 |