<font face="mangal" size="3px">బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 35ఎ తో పాట&# - ఆర్బిఐ - Reserve Bank of India
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 35ఎ తో పాటు సెక్షన్ 56 క్రింద (ఏఏసియస్) నిర్దేశాలు – ది అదూర్ కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, అదూర్, కేరళ – అవధి పొడిగింపు
నవంబర్ 06, 2019 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 35ఎ తో పాటు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35ఎ తో పాటు సెక్షన్ 56 క్రింద భారతీయ రిజర్వు బ్యాంకు, ది అదూర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, అదూర్, కేరళ కు నవంబర్ 02, 2018 తారీఖు డైరెక్టివ్.డిసిబియస్.సిఓ. పిసిసి డి-4/12.26.004/ 2018-19 ద్వారా నవంబర్ 9, 2018 తారీఖు పని వేళల ముగింపు నుండి ఆరు మాసాలపాటు నిర్దేశాలను జారీచేసింది. ఈ నిర్దేశాలు క్రితంసారి మే 03, 2019 తారీఖు డైరెక్టివ్ డిసిబిఆర్.సిఓ.ఏఐడి/నం.డి-43/12.26.004/2018-19 ద్వారా మరో ఆరు మాసాలపాటు నవంబర్ 09, 2019 తారీఖు వరకు పొడిగింపబడ్డాయి. భారతీయ రిజర్వు బ్యాంకు పై చెప్పబడిన బ్యాంక్ యొక్క ఆర్ధిక స్థితి ని సమీక్షించారు మరియు ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పైన ఉటంకించిన నిర్దేశాలను సవరించడం అవసరమని భావించారు. తదనుగుణంగా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35ఎ(1) తో పాటు సెక్షన్ 56 ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో భారతీయ రిజర్వు బ్యాంకు నవంబర్ 05, 2019 తారీఖు డైరెక్టివ్ డిఓఆర్.సిఓ.ఏఐడి/నం.డి-36/12.26.004/2019-20 ద్వారా ఇందుమూలంగా నిర్దేశిస్తున్నది – ది అదూర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, అదూర్ కు నవంబర్ 02, 2018 తారీఖున జారీచేయబడిన డైరెక్టివ్ డిసిబియస్.సిఓ.పిసిసి.డి-4/12.26.004/2018-19 చెల్లుబాటు వర్తింపు, ఎప్పటికప్పుడు సవరించబడి ఇతఃపూర్వం నవంబర్ 09, 2019 వరకు పొడిగింపబడి మరో ఆరు మాసాలబాటు నవంబర్ 10, 2019 నుండి మే 09, 2020 తారీఖు వరకు సమీక్షకు లోబడి, ఆ బ్యాంక్ కు కొనసాగుతుంది. పైన సూచించబడిన డైరెక్టివ్ లోని ఇతర నిబంధనలు మరియు షరతులలో ఎటువంటిమార్పు లేదు. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/1119 |