RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78516690

భాగ్యోదయ ఫ్రెండ్స్ నగర సహకార బ్యాంక్ లిమిటెడ్. వరుద్, జిల్లా-అమరావతి, మహారాష్ట్ర - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు (డైరెక్షన్స్) - నిర్దేశాల కాలపరిమితి పొడిగింపు

తేది: 17/07/2019

భాగ్యోదయ ఫ్రెండ్స్ నగర సహకార బ్యాంక్ లిమిటెడ్. వరుద్, జిల్లా-అమరావతి,
మహారాష్ట్ర - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, (సహకార సంఘాలకు వర్తించే
విధంగా) సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు (డైరెక్షన్స్) - నిర్దేశాల కాలపరిమితి పొడిగింపు

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A (1) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సంతృప్తి చెందినదై, భాగ్యోదయ ఫ్రెండ్స్ నగర సహకార బ్యాంక్ లిమిటెడ్. వరుద్, జిల్లా-అమరావతి, మహారాష్ట్ర ఫై జనవరి 17, 2019 పని వేళల ముగింపు నుండి భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశాలు విధించింది. భారతీయ రిజర్వు బ్యాంకు అట్టి నిర్దేశాల కాల పరిమితిని మరో మూడు నెలలపాటు అంటే జులై 18, 2019 నుండి అక్టోబర్ 17, 2019 వరకు సమీక్షకు లోబడి, మరింత పొడిగించింది. డిపాజిట్ల ఉపసంహరణ/స్వీకరణ విషయంలో పై నిర్దేశాలు కొన్ని పరిమితులు మరియు/లేక ఆంక్షలు విధిస్తాయి. నిర్దేశాల యొక్క నకలు బ్యాంకు ప్రాంగణంలో, ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది. పరిస్థితుల దృష్ట్యా, నిర్దేశాలలో మార్పులను భారతీయ రిజర్వు బ్యాంకు పరిగణలోకి తీసుకొనవచ్చును. జారీ చేసిన ఫై నిర్దేశాలు, భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా బ్యాంకింగ్ లైసెన్సు రద్దు చేసినట్లు భావించరాదు. ఆర్ధిక స్థితి మెరుగుపడేంతవరకు పరిమితులతోకూడిన బ్యాంకింగ్ వ్యాపారాన్ని బ్యాంకు కొనసాగించవచ్చు.

యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/179

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?