<font face="mangal" size="3">డాక్టర్ శివాజీరావు పాటిల్ నీలంగేకర్ నగర సహĵ - ఆర్బిఐ - Reserve Bank of India
డాక్టర్ శివాజీరావు పాటిల్ నీలంగేకర్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, నిలంగా, జిల్లా. లాతూర్, మహారాష్ట్ర – బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు – కాల పరిమితి పొడిగింపు
తేది: 17/10/2019 డాక్టర్ శివాజీరావు పాటిల్ నీలంగేకర్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, నిలంగా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 35A(1) క్రింద, డాక్టర్ శివాజీరావు పాటిల్ నీలంగేకర్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, నిలంగా, జిల్లా. లాతూర్, మహారాష్ట్ర ఫిబ్రవరి 16, 2019 పని వేళల ముగింపు నుండి నిర్దేశాల క్రింద ఉంచబడింది. అట్టి నిర్దేశాలను ఆరు నెలల కాలానికి అక్టోబర్ 16, 2019 నుండి ఏప్రిల్ 15, 2020 వరకు, సమీక్షకు లోబడి పొడిగించడమైనది. నిర్దేశాలు డిపాజిట్ల ఉపసంహరణ/ స్వీకరణ ఫై కొన్ని పరిమితులను విధిస్తాయి. వివరణాత్మక నిర్దేశాలు ఆసక్తిగల ప్రజల పరిశీలన కొరకు బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడ్డాయి. పరిస్థితులను బట్టి నిర్దేశాలలో మార్పులను భారతీయ రిజర్వు బ్యాంకు పరిగణించవచ్చు. నిర్దేశాల విధింపు భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు భావించరాదు. బ్యాంకు తన ఆర్థిక స్థితి మెరుగుపడే వరకు ఆంక్షలతో కూడిన బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగించవచ్చు. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/972 |