<font face="mangal" size="3">బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) సెక్షన్ - ఆర్బిఐ - Reserve Bank of India
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) సెక్షన్ 35ఎ క్రింద నిబంధనలు
(డైరెక్షన్స్)– హిందూ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పఠాన్కోట్, పంజాబ్
మార్చి 27, 2019 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) సెక్షన్ 35ఎ క్రింద నిబంధనలు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 35ఏ, సబ్ సెక్షన్ (1) తో పాటు సెక్షన్ 56 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల ప్రకారం సంక్రమించిన అధికారాలతో ప్రజా ప్రయోజనం దృష్ట్యా , భారతీయ రిజర్వు బ్యాంక్, హిందూ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పఠాన్కోట్, పంజాబ్కు మార్చి 25, 2019 తేదీ వ్యాపారముగింపు వేళల నుండి నిర్దేశాలను (డైరెక్షన్స్) జారీచేసింది. ఈ నిర్దేశాలు ఆ బ్యాంక్ పై అనేక ఆంక్షలు విధించాయి. నిర్దేశాల వివరాలను బ్యాంక్ వెబ్సైటు నందు మరియు బ్యాంక్ ప్రాంగణంలోను ఉంచడం జరుగుతుంది. పరిస్థితులను బట్టి భారతీయ రిజర్వు బ్యాంక్ తమ నిర్దేశాలలో మార్పు చేసే అవకాశాన్ని పరిశీలించవచ్చు. అయితే, ఈ పై నిర్దేశాలు జారీ చేయబడిన కారణంగా, బ్యాంక్ లైసెన్స్ ను భారతీయ రిజర్వు బ్యాంక్ అన్యధా రద్దుచేసినట్లు ఎంతమాత్రం భావించరాదు. వారి ఆర్దిక పరిస్థితి మెరుగయ్యేవరకు, కొన్ని నిబంధనలతో బ్యాంక్ తమ బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తుంది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన : 2018-2019/2298 |