<font face="mangal" size="3">కోలికత మహిళా సహకార బ్యాంక్ లిమిటెడ్, కోల్‌కత - ఆర్బిఐ - Reserve Bank of India
కోలికత మహిళా సహకార బ్యాంక్ లిమిటెడ్, కోల్కతా – బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా), సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు (డైరెక్షన్స్)
తేది: 09/07/2019 కోలికత మహిళా సహకార బ్యాంక్ లిమిటెడ్, కోల్కతా – బ్యాంకింగ్ నియంత్రణ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A(1) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, కోలికత మహిళా సహకార బ్యాంక్ లిమిటెడ్, 8డి, కృష్ణ లాహా లేన్, కోల్కతా-700 012 ఫై భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశాలు విధించింది. ఆ ప్రకారంగా జులై 9, 2019 పనివేళల ముగింపు నుండి పైన ఉదహరించిన బ్యాంకు; భారతీయ రిజర్వు బ్యాంకు నుండి ముందస్తు లిఖిత అనుమతి లేకుండా మరియు జులై 9, 2019 నాటి ఆదేశంలో వున్న మరియు బ్యాంకు యొక్క ప్రాంగణంలో ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడిన నిర్దేశాలకు అనుగుణంగా తప్ప, ఎటువంటి రుణాలను మంజూరు చేయడం లేదా పునరుద్ధరించడం, ఏదైనా పెట్టుబడులను పెట్టడం, ఎటువంటి బాధ్యతను అంటే నిధులను అప్పుతెచ్చుకోవడం, తాజా డిపాజిట్లను ఆమోదించడం మరియు తన చెల్లింపు బాధ్యతల మొత్తాలనించి వేరే చెల్లింపుల పంపిణీకి వొడంబడటం లేదా ఏదైనా రాజీ లేక పరిష్కార ప్రయత్నాలు చేయడం, తన ఆస్తులను బదలాయించడం లేదా అమ్మడం మొదలగు కార్యకలాపాలు చేయరాదు. ప్రత్యేకించి, ప్రతి డిపాజిటుదారు పొదుపు ఖాతా లేదా వాడుక ఖాతా లేదా మొత్తం డిపాజిట్ ఖాతా నుండి కేవలం ₹ 1000 (ఒక వేయి రూపాయలు మాత్రమే) మించని మొత్తం తీసుకోవచ్చు. పైన పేర్కొన్న ఆర్బిఐ ఆదేశాలలో పేర్కొన్న షరతులకు లోబడి, రుణగ్రహీతగా లేదా షూరిటీగా, ఈ మొత్తాన్ని మొదట సంబంధిత రుణ ఖాతా/లకు సర్దుబాటు చేయవచ్చు. ఆర్బిఐ ద్వారా జారీ చేయబడిన ఫై నిర్దేశాలను, తప్పనిసరిగా పాటించవలసిన మార్గదర్శకాలను/ఆదేశాలను బ్యాంకు ఉల్లంఘించినందుకు మాత్రమే తప్ప, భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా బ్యాంకింగ్ లైసెన్సు రద్దు చేసే చర్యగా దీన్ని భావించరాదు. ఆర్ధిక స్థితి మెరుగుపడేంతవరకు, పరిమితులకు లోబడి బ్యాంకు తన బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తుంది. భారతీయ రిజర్వు బ్యాంకు ఈ నిర్దేశాలలో మార్పులను పరిస్థితుల మీద ఆధారపడి, పరిగణించవచ్చును. ఈ నిర్దేశాలు జూలై 9, 2019 పనివేళల ముగింపు నుండి ఆరు నెలల కాలానికి మరియు ఎప్పటికప్పుడు సమీక్షకు లోబడి, అమలులో ఉంటాయి. యోగేష్ దయాళ్ పత్రికా ప్రకటన: 2019-2020/99 |