<font face="mangal" size="3">మిల్లత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., దావణ్‌గెరే జ - ఆర్బిఐ - Reserve Bank of India
మిల్లత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., దావణ్గెరే జిల్లా, కర్నాటక –
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు),
సెక్షన్ 35A క్రింద నిర్దేశాల జారీ
తేది: 10/05/2019 మిల్లత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., దావణ్గెరే జిల్లా, కర్నాటక – బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సబ్-సెక్షన్ (1) సెక్షన్ 35A క్రింద (సెక్షన్ 56 తో కలిపి), తమకు దఖలు పరచిన అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మిల్లత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., దావణ్గెరే జిల్లా, కర్నాటకకు, కొన్ని నిర్దేశాలు జారీచేసినదని తెలపడమైనది. ఈ నిర్దేశాల ప్రకారం, పైన పేర్కొన్న బ్యాంక్, మే 08, 2019 పనివేళల ముగింపునుండి, రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్ 26, 2019 జారీచేసిన నిర్దేశాలలో తెలిపినమేరకు తప్ప, వారి లిఖితపూర్వక అనుమతి లేనిదే, అప్పులు, రుణాలు జారీ చేయుట/నవీకరించుట; పెట్టుబడులు పెట్టుట; అప్పులుతీసుకొనుట/ క్రొత్త డిపాజిట్లు స్వీకరించుటవంటి రుణ భారము అంగీకరించుట; వారు చేసిన రుణాలు తిరిగి చెల్లించుటకుగాని లేక మరొక కారణంగాగాని, ఎటువంటి చెల్లింపులు చేయుట లేక చెల్లించుటకు అంగీకరించుట; రాజీ లేక ఇతర ఒప్పందాలు కుదుర్చుకొనుట; వారి ఆస్తులను అమ్ముట, బదిలీ చేయుట లేక ఇతర మార్గాలలో ఇచ్చివేయుట, చేయరాదు. ఈ నిర్దేశాల ప్రతి, ప్రజల సమాచారం కోసం, మిల్లత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ప్రాంగణంలో ప్రదర్శింపబడినది. ప్రత్యేకించి, ప్రతి సేవింగ్స్ బ్యాంక్ / కరెంట్ అకౌంట్ / ఏ ఇతర డిపాజిట్ ఖాతాలో (ఏ పేరుతో పిలవబడినా), గల నిల్వనుండి, రూ. 1,000/- (కేవలం ఒక వెయ్యి రూపాయిలు) మించకుండా, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకులోబడి, ఒక్కసారి విత్డ్రా చేయుటకు మాత్రమే, బ్యాంక్ అనుమతించవచ్చు. రిజర్వ్ బ్యాంక్, పై నిర్దేశాలు జారీ చేసినంత మాత్రాన, బ్యాంకుయొక్క లైసెన్స్ రద్దు చేసినట్లు భావించరాదు. బ్యాంక్, వారి ఆర్థిక స్థితి మెరుగుపడేవరకు, కొన్ని నిబంధనలతో బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. పరిస్థితులకు అనుసారంగా, రిజర్వ్ బ్యాంక్, ఈనిర్దేశాలలో మార్పులు చేయవచ్చు. శైలజా సింగ్ పత్రికా ప్రకటన: 2018-2019/2650 |