RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78517708

సెక్షన్‌ 35A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 క్రింద (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), నిర్దేశాల జారీ – రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి. పూణే, మహారాష్ట్ర

తేది: 27/02/2019

సెక్షన్‌ 35A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 క్రింద (కో-ఆపరేటివ్
సొసైటీలకు వర్తించేమేరకు), నిర్దేశాల జారీ –
రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి. పూణే, మహారాష్ట్ర

రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పూణే, మహారాష్ట్ర, ఫిబ్రవరి 21, 2013 ఆదేశాలద్వారా, ఫిబ్రవరి 22, 2013 పనిముగింపు వేళనుండి, నిర్దేశాల పరిధిలోకి తేబడినది. తదుపరి నిర్దేశాలద్వారా, వీటి కాలపరిమితి ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ వచ్చింది. నవంబర్ 27, 2018 జారీచేసిన చివరి నిర్దేశాలు, ఫిబ్రవరి 28, 2019 వరకు అమలులో ఉన్నాయి.

రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సబ్-సెక్షన్‌ (1), సెక్షన్‌ 35 A, (సెక్షన్‌ 56తో కలిపి), క్రింద తమకు దఖలుపరచబడ్డ అధికారాలు వినియోగించి, పైన పేర్కొన్న బ్యాంకుకు, ఫిబ్రవరి 21, 2013 న జారీ చేయబడి ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ వచ్చి, చివరిసారి ఫిబ్రవరి 28, 2019 వరకు పొడిగించబడిన నిర్దేశాలు, ఫిబ్రవరి 26, 2019 తేదీ ఆదేశాలద్వారా, మరొక మూడు నెలల కాలం (అనగా మార్చ్ 01, 2019 నుండి మే 31, 2019 వరకు) సమీక్షకులోబడి, అమలులో కొనసాగుతాయని, ఇందుమూలముగా ప్రజలకు తెలియజేయడమైనది. పైన పేర్కొన్న నిర్దేశాలలోని ఇతర నియమ నిబంధనలలో ఏ మార్పూ లేదు.

కాలపరిమితి పొడిగిస్తూ, ఫిబ్రవరి 26, 2019 జారీచేసిన నిర్దేశాల ప్రతి, ప్రజల సమాచారం కొరకు, రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో ప్రదర్శించబడినది.

పైన తెలిపిన పొడిగింపు / మార్పులు చేసినంతమాత్రాన, బ్యాంకుయొక్క ఆర్థిక స్థితి బాగా మెరుగయిందని రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందినట్లు, ఏమాత్రమూ భావించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/2047

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?