<font face="mangal" size="3">బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసై - ఆర్బిఐ - Reserve Bank of India
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు),
సెక్షన్ 35 A క్రింద నిర్దేశాల జారీ – రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పుణే, మహారాష్ట్ర
తేదీ: 31/05/2019 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), ఫిబ్రవరి 21, 2013 తేదీ ఆదేశాలద్వారా, రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పుణే, మహారాష్ట్ర, ఫిబ్రవరి 22, 2013 పని ముగింపు వేళల నుండి, నిర్దేశాల పరిధిలోకి తేబడినది. ఆ నిర్దేశాల గడువు, తదుపరి అదేశాల ద్వారా ఎప్పటికప్పుడు పొడిగించడం జరిగింది. ఫిబ్రవరి 25, 2019 తేదీన జారీ చేసిన చివరి ఆదేశం ద్వారా, నిర్దేశాల గడువు మే 31, 2019 వరకు, సమీక్షకు లోబడి, పొడిగించబడినది. రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 35 A, సబ్-సెక్షన్ (1) ద్వారా (సెక్షన్ 56తో కలిపి), తమకు దఖలు పరచబడ్డ అధికారాలు వినియోగించి, ఫిబ్రవరి 21, 2013 తేదీన పైన పేర్కొన్న బ్యాంకుకు జారీ చేయబడి, ఆ తరువాత ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివరి సారి మే 31, 2019 వరకు పొడిగించబడ్డ నిర్దేశాలు, మరొక మూడు నెలలు (అనగా జూన్ 01, 2019 నుండి ఆగస్ట్ 31, 2019 వరకు ), బ్యాంకుకు వర్తిస్తాయని, మే 27, 2019 తేదీన అదేశించడం జరిగిందని, ప్రజలకు తెలియజేయడమైనది. ఈ ఆదేశాలు తిరిగి సమీక్షించవచ్చు. నిర్దేశాలలోని ఇతర నియమ నిబంధనలలో, ఎట్టి మార్పూ లేదు. నిర్దేశాల కాలపరిమితి పెంచుతూ, మే 27, 2019 న జారీచేసిన ఆదేశాల ప్రతి, రుపీ కో-ఆపరేటివ్ బ్యాంకు ఆవరణలో, ప్రజల సమాచారార్ధం, ప్రదర్శించబడినది. రిజర్వ్ బ్యాంక్, పైన తెలిపిన కాలపరిమితి పొడిగింపు మరియు / లేక మార్పులు చేసినంతమాత్రాన, బ్యాంకుయొక్క ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడిందని రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందినట్లుగా, ఏ మాత్రమూ భావించరాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/2829 |