RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78516746

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) సెక్షన్ 35ఎ క్రింద డైరెక్షన్స్ – రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పూణే, మహారాష్ట్ర

ఆగష్టు 30, 2019

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) సెక్షన్ 35ఎ క్రింద డైరెక్షన్స్ –
రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పూణే, మహారాష్ట్ర

పూణే, మహారాష్ట్ర లోని రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ను ఫిబ్రవరి 21, 2013 వ తేదీన జారీ చేసిన డైరెక్టివ్ ద్వారా ఫిబ్రవరి 22, 2013 వ తేదీ పని ముగింపువేళ నుండి ఆర్బీఐ ఆదేశాల క్రింద ఉంచడం జరిగింది. పై అదేశాల వర్తింపు ఎప్పటికప్పుడు తదుపరి డైరెక్టివ్స్ ద్వారా, క్రిందటి పర్యాయము మే 27, 2019 తేదీ డైరెక్టివ్ ద్వారా, పొడిగించబడింది మరియు సమీక్షకు లోబడి ఆగష్టు 31, 2019వ తేదీ వరకు చెల్లుబాటు అవుతున్నది.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35 ఎ (1) తో పాటు సెక్షన్ 56 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో భారతీయ రిజర్వు బ్యాంకు ప్రజా శ్రేయస్సు దృష్ట్యా తెలియజెప్పేదేమిటంటే; పై పేర్కొనబడిన బ్యాంక్ కు జారీచేసిన ఫిబ్రవరి 21, 2013 తేదీ డైరెక్టివ్ చెల్లుబాటు ఎప్పటికప్పుడు పొడిగింపబడుతూ ఇంతకుమునుపు ఆగష్టు 31, 2019 వరకు పొడిగింపబడి; మరో మూడు నెలలబాటు సెప్టెంబర్ 01, 2019 నుండి నవంబర్ 30, 2019 వ తేదీ వరకు ఆ బ్యాంక్ కు దీని వర్తింపు కొనసాగుతుందని; సమీక్షకు లోబడి ఆగష్టు 28, 2019 వ తేదీ డైరెక్టివ్ ద్వారా ఇందుమూలంగా నిర్దేశించారని. ఉటంకించిన ఆదేశాలలోని అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులలో ఎటువంటిమార్పు లేదు.

ఆగష్టు 28, 2019 వ తేదీ నాటి గడువు పొడిగింపు ఆదేశం నకలును ప్రజల పరిశీలనార్ధం ఆ బ్యాంక్ పరిసరాలలో ప్రదర్శించటం జరుగుతుంది.

భారతీయ రిజర్వు బ్యాంకు చే పై పేర్కొనబడిన పొడిగింపు మరియు / లేదా సవరణ ను అన్యధా బ్యాంక్ యొక్క ఆర్ధిక పరిస్థితి చెప్పుకోదగిన విధంగా మెరుగుపడిందని రిజర్వు బ్యాంకు సంతృప్తిచెందిందనిగా పరిగణించరాదు.

యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/577

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?