<font face="mangal" size="3">సెక్షన్‌ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-అపర& - ఆర్బిఐ - Reserve Bank of India
సెక్షన్ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-అపరేటివ్
సొసైటీలకు వర్తించేమేరకు), క్రింద రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్
లి., పుణే, మహారాష్ట్రకు జారీచేసిన ఆదేశాల గడువు పొడిగింపు
తేదీ: 26/11/2020 సెక్షన్ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-అపరేటివ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వారి ఆదేశాలు UBD.CO.BSD-I/D-28/12.22.218/2012-13, ఫిబ్రవరి 21, 2013 ద్వారా, రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పుణే, మహారాష్ట్రను, ఫిబ్రవరి 22, 2013 తేదీ పని ముగింపు వేళనుండి నిర్దేశాల పరిధిలోకి తెచ్చినది. ఆ నిర్దేశాల గడువు, తదుపరి అదేశాల ద్వారా ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివరన నవంబర్ 30, 2020 వరకు పొడిగించబడింది. 2. రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సబ్-సెక్షన్ (1) సెక్షన్ 35 A (సెక్షన్ 56తో సహా), ద్వారా తమకు దఖలుపరచబడ్డ అధికారాలు వినియోగించి, పైన పేర్కొన్న ఆదేశాలు, ఫిబ్రవరి 28, 2021 వరకు బ్యాంకుకు వర్తిస్తాయని, DOR.AID.No.D-35/12.22.218/2020-21, తేదీ నవంబర్ 24, 2020 ద్వారా అదేశించడం జరిగిందని, ప్రజలకు తెలియజేయడమైనది. ఈ ఆదేశాలు తిరిగి సమీక్షించ వచ్చు. 3. పైన పేర్కొన్న నిర్దేశాలలోని ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పు లేదు. కాలపరిమితి పెంచుతూ, నవంబర్ 24, 2020 తేదీన జారీచేసిన ఆదేశాల ప్రతి, రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పుణే, మహారాష్ట్ర, ఆవరణలో, ప్రజల సమాచారార్ధం, ప్రదర్శించబడినది. 4. పైన తెలిపిన కాలపరిమితి పొడిగింపు మరియు / లేక మార్పులు చేసినంతమాత్రాన, బ్యాంకుయొక్క ఆర్థిక స్థితి గురించి రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందినట్లుగా, ఏ మాత్రమూ భావించరాదు. (యోగేశ్ దయాల్) పత్రికా ప్రకటన: 2020-2021/691 |