<font face="mangal" size="3">సన్మిత్ర సహకారి బ్యాంక్ మర్యాదిత్, ముంబై, మహ - ఆర్బిఐ - Reserve Bank of India
సన్మిత్ర సహకారి బ్యాంక్ మర్యాదిత్, ముంబై, మహారాష్ట్రకు, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 35 A క్రింద నిర్దేశాల జారీ
తేదీ: సెప్టెంబర్ 13, 2017 సన్మిత్ర సహకారి బ్యాంక్ మర్యాదిత్, ముంబై, మహారాష్ట్రకు, సన్మిత్ర సహకారి బ్యాంక్ మర్యాదిత్, ముంబై, మహారాష్ట్ర, జూన్ 14, 2016 తేదీన జారీ చేసిన ఆదేశాలద్వారా, జూన్ 14, 2016 తేదీ పనివేళల ముగింపు నుండి, ఆరు నెలలకాలానికి, నిర్దేశాలకు లోబడి ఉన్నది. ఈ నిర్దేశాల కాలపరిమితి, డిసెంబర్ 07, 2016, మరియు జూన్ 08, 2017 ఆదేశాల ప్రకారం, వరుసగా ఆరు నెలలు, మూడు నెలలు పెంచడం జరిగింది. జూన్ 14, 2016, డిసెంబర్ 07, 2016 మరియు జూన్ 08, 2017 ఆదేశాల ద్వారా పొడిగించబడిన ఈ నిర్దేశాల కాలపరిమితి, సెప్టెంబర్ 08, 2017 తేదీన జారీచేసిన, ఆదేశాల ద్వారా మరొక ఆరు నెలలు (అనగా సెప్టెంబర్ 15, 2017 నుండి మార్చ్ 14, 2018 వరకు), సవరణలకు లోబడి, పొడిగించబడినదని, ఇందుమూలంగా ప్రజలకు తెలియచేయడమైనది. పైన పేర్కొన్న నిర్దేశాలలోని ఇతర షరతులు, నిబంధనలలో ఎట్టి మార్పూ లేదు. సెప్టెంబర్ 08, 2017న జారీచేసిన ఆదేశాల ప్రతి, ప్రజల సమాచారంకోసం, సన్మిత్ర సహకారి బ్యాంక్ మర్యాదిత్, ఆవరణలో ప్రదర్శించబడినది. రిజర్వ్ బ్యాంక్, పైన తెలిపిన సవరణలు చేసినంత మాత్రాన, బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడిందని తృప్తి చెందిందని భావించరాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/722 |