<font face="mangal" size="3">బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర - ఆర్బిఐ - Reserve Bank of India
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది), సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు – శివాజీ రావు భోంస్లే సహకారి బ్యాంక్ లిమిటెడ్, పూణే, మహారాష్ట్ర - నిర్దేశాల కాలపరిమితి పొడిగింపు
అక్టోబర్ 3, 2020 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు మే 03, 2019 నాటి భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశం DCBS.CO.BSD-1/D-14/12.22.254/2018-19 ప్రకారం, శివాజీ రావు భోంస్లే సహకారి బ్యాంక్ లిమిటెడ్, పూణే, మహారాష్ట్ర, మే 04, 2019 పనివేళల ముగింపు నుండి ఆరు నెలల కాలానికి నిర్దేశాల క్రింద ఉంచబడింది. ఈ క్రమంలో చివర ఇచ్చిన జులై 31, 2020 నాటి ఆదేశం DOR.CO.AID/No. D-10/12.22.254/2020-21 ప్రకారం అట్టి నిర్దేశం అక్టోబర్ 04, 2020 వరకు పొడిగింపబడింది. 2. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది), సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A (1) క్రింద ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుని, మే 03, 2019, నాటి భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశం DCBS.CO.BSD-1/D-14/12.22.254/2018-19 ద్వారా శివాజీ రావు భోంస్లే సహకారి బ్యాంక్ లిమిటెడ్, పూణే, మహారాష్ట్ర ఫై జారీచేయబడిన మరియు సమయానుసారంగా పొడిగిస్తూ, చివరిసారిగా అక్టోబర్ 04, 2020 వరకు పొడిగింపబడిన నిర్దేశం మరో రెండు నెలల కాలానికి అంటే అక్టోబర్ 05, 2020 నుండి డిసెంబర్ 04, 2020 వరకు భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జారీ చేయబడిన సెప్టెంబర్ 30, 2020 నాటి ఆదేశం DOR.CO.AID/No.D-24/12.22.254/2020-21 ద్వారా, సమీక్షకు లోబడి అమలులో ఉంటుందని ప్రజా సూచనార్ధం తెలియజేయడమైనది. 3. పైన ఉటంకించిన ఆదేశం యొక్క అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులు మార్పు లేకుండా యథా తథంగా ఉంటాయి. సెప్టెంబర్ 30, 2020 న జారీ చేసిన పొడిగింపబడిన ఆదేశం యొక్క నకలు బ్యాంకు ప్రాంగణంలో, ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడింది. 4. పైన పేర్కొన్న పొడిగింపు మరియు/లేదా సవరణ, బ్యాంక్ యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల, భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని అన్వయించుకోరాదు. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన : 2020-2021/430 |