<font face="mangal" size="3">బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (AACS) సెక్షన్ 35 A క&# - ఆర్బిఐ - Reserve Bank of India
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (AACS) సెక్షన్ 35 A క్రింద జారీ చేసిన సూచనలు – శ్రీ గణేశ్ సహకారి బ్యాంక్ లిమిటెడ్., నాసిక్, మహారాష్ట్ర
మార్చి 30, 2017 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (AACS) సెక్షన్ 35 A క్రింద జారీ చేసిన సూచనలు – మహారాష్ట్రలోని నాసిక్ కు చెందిన శ్రీ గణేశ్ సహకారి బ్యాంక్ లిమిటెడ్ ను బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (AACS) లోని సెక్షన్ 35 A క్రింద ఏప్రిల్ 01, 2013న జారీ చేసిన ఆదేశాలను అనుసరించి ఆరునెలల పాటు ఉత్తర్వుల క్రింద ఉంచడం జరిగింది. ఆ ఉత్తరువులను సెప్టెంబర్ 23, 2013, మార్చి 27, 2014, సెప్టెంబర్ 17, 2014, మార్చి 19, 2015, సెప్టెంబర్ 15, 2015, మార్చి 11, 2016, సెప్టెంబర్ 26, 2016న జారీ చేసిన ఆదేశాలను అనుసరించి ఏడుసార్లు పొడిగించడం జరిగింది. అంతే కాకుండా, జులై 18, 2016న జారీ చేసిన ఆదేశాల ద్వారా నగదు ఉపసంహరణ పరిమితిని రూ.50,000కు పెంచడం జరిగింది. ఈ ఆదేశాలు మార్చి 29, 2017 వరకు వర్తించాయి. పైన పేర్కొన్న బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితిని సమీక్షించిన రిజర్వ్ బ్యాంక్, ప్రజా ప్రయోజనార్థం ఆ ఆదేశాలను సవరించాలని నిర్ణయించింది. అందువల్ల బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 లోని సబ్ సెక్షన్స్ (1) మరియు (2) ఆఫ్ సెక్షన్ 35 A, రెడ్ విత్ సెక్షన్ 56 ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 ద్వారా సంక్రమించిన అధికారాలను అనుసరించి, రిజర్వ్ బ్యాంక్ ఈ క్రింది ఆదేశాలు జారీ చేసినది – నాసిక్ లోని శ్రీ గణేశ్ సహకారి బ్యాంక్ లిమిటెడ్ కు జులై 18, 2016న జారీ చేసిన ఆదేశాలలోని పేరా 1 (1) ను ఈ క్రింది విధంగా సవరించుకొనవచ్చును - ‘’i. డిపాజిట్ దారులు ప్రతి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ లేదా టర్మ్ డిపాజిట్ అకౌంట్ లేదా ఏ ఇతర డిపాజిట్ అకౌంట్ (దానిని ఏ పేరుతో పిలిచినప్పటికీ) నుండి అయినా రూ.70,000 (డెబ్బై వేల రూపాయలకు) మించకుండా నగదును ఉపసంహరించుకొనేందుకు అనుమతించవచ్చు. అయితే, అలాంటి డిపాజిట్ దారుడు బ్యాంకుకు రుణగ్రహీతగా లేదా ష్యూరిటీగా ఏదో ఒక రూపేణా పూచీకత్తు ఉన్నట్లయితే, బ్యాంకు డిపాజిట్లపై తీసుకున్న రుణాలతో సహా, మొదట ఆ నగదును సంబంధిత రుణం తీసుకున్న అకౌంట్ కు సవరించడం జరుగుతుంది. బ్యాంకు డిపాజిర్లకు చెల్లించాల్సిన నగదును ప్రత్యేకంగా ఒక ఎస్ర్కో అకౌంట్ లో కానీ లేదా/మరియు వాటికై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెక్యూరిటీలలో కానీ ఉంచుకోవాలి. బ్యాంకులు ఆ నగదును సవరించిన సూచనలకు అనుగుణంగా కేవలం డిపాజిటర్లకు చెల్లించేందుకు మాత్రమే ఉపయోగించుకోవాలి. ‘’ అంతే కాకుండా, ప్రజా ప్రయోజనార్థం రిజర్వ్ బ్యాంక్ నాసిక్ లోని శ్రీ గణేశ్ సహకారి బ్యాంక్ లిమిటెడ్ కు ఏప్రిల్ 01, 2013న జారీ చేసిన ఆదేశాలను మరో ఆరు నెలల పాటు పొడిగించాలని నిర్ణయించింది. తదనుగుణంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 లోని సబ్ సెక్షన్స్ (1) మరియు (2) ఆఫ్ సెక్షన్ 35 A, రెడ్ విత్ సెక్షన్ 56 ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 ద్వారా సంక్రమించిన అధికారాలను అనుసరించి, రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్ 01, 2013న జారీ చేసిన ఆదేశాల ప్రకారం మార్చి 29, 2017 వరకు ఉన్న గడువును మరో ఆరు నెలల పాటు అనగా మార్చి 30, 2017 నుండి సెప్టెంబర్ 29, 2017, సమీక్షకు లోబడి, పొడిగించడమైనది. బ్యాంకు యొక్క పునర్ వ్యవస్థీకరణకు సహకరించే ప్రయత్నాల్లో భాగంగా - బ్యాంకు రెగ్యులర్ మరియు సెక్యూర్డ్ క్యాష్ క్రెడిట్ అకౌంట్లను పునరుద్ధరించుకొనేందుకు, డిపాజిట్లపై రుణాల సర్ధుబాట్లకు, కొత్త సభ్యులను చేర్చుకునేందుకు, మార్చి 24, 2017న జారీ చేసిన ఆదేశాలలోని నియమ నిబంధనలకు లోబడి, అనుమతించడం జరుగుతోంది. పైన పేర్కొన్న ఉత్తరువులకు చెందిన ఇతర నియమ నిబంధనలలో ఎలాంటి మార్పూ ఉండదు. ప్రజల పరిశీలనార్థం మార్చి 24, 2017న జారీ చేసిన ఆ ఉత్తరువుల కాపీని బ్యాంకు పరిసరాలలో ప్రదర్శించడం జరుగుతుంది. భారతీయ రిజర్వ్ బ్యాంకు చేసిన ఆ మార్పును అనుసరించి ఆ బ్యాంకు యొక్క ఆర్థిక పరిస్థితి చెప్పుకోదగినంతగా మెరుగుపడిందని రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందిందని భావిస్తున్నట్లుగా పరిగణించరాదు. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్: 2016-17/2618 |