RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78522286

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు),
సెక్షన్‌ 35 A క్రింద ఆదేశాల జారీ – శ్రీ ఆనంద్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి.,
చించవాడ్, పుణే, మహారాష్ట్ర

తేది: 25/06/2019

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు),
సెక్షన్‌ 35 A క్రింద ఆదేశాల జారీ – శ్రీ ఆనంద్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి.,
చించవాడ్, పుణే, మహారాష్ట్ర

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (వారి ఆదేశాలు తేదీ జూన్‌ 21, 2019 ద్వారా), శ్రీ ఆనంద్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., చించవాడ్, పుణే, మహారాష్ట్ర ను నిర్దేశాల పరిధిలోకి తెచ్చినది. ఈ నిర్దేశాలను అనుసరించి, సేవింగ్స్ బ్యాంక్ / కరెంట్ అకౌంట్ / ఏ ఇతర డిపాజిట్ ఖాతా నుండి (ఏపేరుతో పిలువబడినా), రూ. 1,000 (ఒక వెయ్యి రూపాయిలు) లోపు మాత్రమే, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు లోబడి, విత్‌డ్రా చేయుటకు అనుమతించబడుతుంది. ఇంతేగాక, శ్రీ ఆనంద్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., చించవాడ్, పుణే, మహారాష్ట్ర, రిజర్వ్ బ్యాంక్ లిఖితపూర్వక అనుమతి లేనిదే, జూన్‌ 21, 2019 తేదీన జారీచేసిన ఆదేశాలను అతిక్రమించి, అప్పులు, రుణాలు జారీ చేయుట/నవీకరించుట; పెట్టుబడులు పెట్టుట; అప్పులు, క్రొత్త డిపాజిట్లు స్వీకరించుటతో కలిపి ఎటువంటి భారము అంగీకరించుట; వారు చేసిన రుణాలు తిరిగి చెల్లించుటకుగాని లేక మరొక కారణంగాగాని ఎటువంటి చెల్లింపులు చేయుట లేక చెల్లించుటకు అంగీకరించుట; రాజీ లేక ఇతర ఒప్పందాలు కుదుర్చుకొనుట; వారి ఆస్తులను అమ్ముట, బదిలీ చేయుట లేక ఇతర మార్గాలలో ఇచ్చివేయుట, చేయరాదు. ఈ నిర్దేశాలు, జూన్‌ 25, 2019 బ్యాంక్ పనివేళల ముగింపు సమయంనుండి, ఆరు నెలల కాలం అమలులో ఉంటాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పైన తెలిపిన నిర్దేశాలు జారీ చేసినంత మాత్రాన, బ్యాంకు లైసెన్స్ రద్దు చేసినట్లు భావించరాదు. బ్యాంక్, వారి ఆర్థిక స్థితి మెరుగుపడేవరకు, కొన్ని నిబంధనలతో బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. పరిస్థితులను సమీక్షించి, రిజర్వ్ బ్యాంక్ ఈనిర్దేశాలలో మార్పులు చేయవచ్చు.

బ్యాంకింగ్ రెగ్యులేషన్‌ చట్టం 1949, సబ్-సెక్షన్‌ (1), సెక్షన్‌ 35A ( సెక్షన్‌ 56 తో కలిపి), క్రింద తమకు దఖలు పరచిన అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్, ఈఆదేశాలను జారీ చేసింది. జూన్‌ 21, 2019 తేదీన జారీచేసిన ఆదేశాల ప్రతి, ప్రజల సమాచారం కోసం, శ్రీ ఆనంద్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ప్రాంగణంలో ప్రదర్శింపబడినది.

యోగేశ్ దయాల్
చీఫ్ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2018-2019/3034

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?