<font face="mangal" size="3">ది సి కె పి కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహార&# - ఆర్బిఐ - Reserve Bank of India
ది సి కె పి కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర – బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 35 A క్రింద నిర్దేశాల జారీ
తేదీ: జులై 31, 2017 ది సి కె పి కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర – ఏప్రిల్ 30, 2014 తేదీన UBD.CO.BSD-I. No. D 34/12.22.035/2013-14 ద్వారా జారీచేసిన ఆదేశాల మేరకు, ది సి కె పి కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర, మే 2, 2014 పని ముగింపు వేళల నుండి, నిర్దేశాల పరిధిలోకి తేబడినది. ఆ నిర్దేశాల గడువు, తదుపరి అదేశాల ద్వారా ఎప్పటికప్పుడు పొడిగించడం జరిగింది. DCBR. CO.AID.No..D-27/12.22.035/2016-17, తేదీ జనవరి 27, 2017 ద్వారా జారీ చేసిన చివరి ఆదేశం, జులై 31, 2017 గడువు వరకు జారీచేయబడినది. దీనిని తిరిగి సమీక్షించవచ్చు. 2. తదనుసారంగా, రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సెక్షన్ 35 A, సబ్-సెక్షన్ (1), తో సహా సెక్షన్ 56 ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలు వినియోగించి, ఏప్రిల్ 30, 2014 న పైన పేర్కొన్న బ్యాంకుకు జారీ చేయబడి, ఆ తరువాత ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివరి సారి జులై 31, 2017 వరకు పొడిగించబడ్డ నిర్దేశాలు, మరొక నాలుగు నెలల వరకు (అనగా ఆగస్ట్ 01, 2017 నుండి నవంబరు 30, 2017 వరకు) బ్యాంకుకు వర్తిస్తాయని, DCBR.CO.AID.No. D-04/12.22.035/2017-18, తేదీ జులై 26, 2017 ద్వారా అదేశించడం జరిగిందని, ప్రజలకు తెలియజేయడమైనది. ఈ ఆదేశాలు తిరిగి సమీక్షించ వచ్చు. కాలపరిమితి పెంచుతూ, జులై 26, 2017 న జారీచేసిన ఆదేశాల ప్రతి, సి కె పి బ్యాంకు ఆవరణలో, ప్రజల సమాచారార్ధం, ప్రదర్శించబడినది. పైన తెలిపిన కాలపరిమితి పొడిగింపు/మార్పులు చేసినంతమాత్రాన, వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడిందని రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందినట్లుగా, ఏ మాత్రమూ భావించరాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/296 |