<font face="mangal" size="3">ది సి కె పి కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారా - ఆర్బిఐ - Reserve Bank of India
ది సి కె పి కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర –
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 35 A క్రింద నిర్దేశాల జారీ
తేదీ: నవంబర్ 29, 2017 ది సి కె పి కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర – ఏప్రిల్ 30, 2014 తేదీన జారీచేసిన ఆదేశాల మేరకు, ది సి కె పి కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర, మే 2, 2014 పని ముగింపు వేళల నుండి, నిర్దేశాల పరిధిలోకి తేబడినది. ఆ నిర్దేశాల గడువు, తదుపరి అదేశాల ద్వారా ఎప్పటికప్పుడు పొడిగించడం జరిగింది. జులై 26, 2017 తేదీన జారీ చేసిన చివరి ఆదేశం ద్వారా (సమీక్షకులోబడి), నవంబర్ 30, 2017 వరకు, పొడిగించబడినది. 2. రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సబ్-సెక్షన్ (1), సెక్షన్ 56తో సహా సెక్షన్ 35 A, ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలు వినియోగించి, ఏప్రిల్ 30, 2014 న పైన పేర్కొన్న బ్యాంకుకు జారీచేయబడి, ఆతరువాత ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివరి సారి నవంబర్ 30, 2017 వరకు పొడిగించబడ్డ నిర్దేశాలు, మరొక నాలుగు నెలలపాటు,(అనగా డిసెంబర్ 01, 2017 నుండి మార్చ్ 31, 2018 వరకు) బ్యాంకుకు వర్తిస్తాయని, నవంబర్ 23, 2017 తేదీన, అదేశించడం జరిగిందని, ప్రజలకు తెలియజేయడమైనది. ఈ ఆదేశాలు, తిరిగి సమీక్షించవచ్చు. కాలపరిమితి పెంచుతూ, నవంబర్ 23, 2017 న జారీచేసిన ఆదేశాల ప్రతి, సి కె పి బ్యాంకు ఆవరణలో, ప్రజల సమాచారార్ధం, ప్రదర్శించబడినది. పైన తెలిపిన కాలపరిమితి పొడిగింపు/మార్పులు చేసినంతమాత్రాన, వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడిందని రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందినట్లుగా, ఏ మాత్రమూ భావించరాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/1476 |