<font face="mangal" size="3">బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 35A క్రింద &# - ఆర్బిఐ - Reserve Bank of India
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు - సికెపి సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర
ఫిబ్రవరి 28, 2019 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు - సికెపి సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర ఏప్రిల్ 30, 2014 నాటి భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశం ప్రకారం, సికెపి సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర మే 02, 2014 నుండి నిర్దేశాల క్రింద ఉంచబడింది. సమయానుసారంగా అట్టి నిర్దేశాలను తదుపరి ఆదేశాలతో భారతీయ రిజర్వు బ్యాంకు పొడిగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో చివర ఇచ్చిన నవంబర్ 27, 2018 నాటి నిర్దేశం ఫిబ్రవరి 28, 2019 వరకు, సమీక్ష కు లోబడి చెల్లుబాటు లో వుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949, సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A (1) క్రింద ఉన్న అధికారాలను వినియోగించుకుని, బ్యాంకుకు ఫిబ్రవరి 28, 2019 వరకు పొడిగింపబడిన నవంబర్ 27, 2018 నాటి నిర్దేశాన్ని, ఫిబ్రవరి 26, 2019 న జారీ చేసిన ఆదేశం ద్వారా మరో 3 నెలలపాటు అంటే మార్చ్ 01, 2019 నుండి మే 31, 2019 వరకు భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా పొడిగింపబడింది. ఫిబ్రవరి 26, 2019 న జారీ చేసిన పొడిగింపబడిన నిర్దేశం యొక్క నకలు బ్యాంకు ప్రాంగణంలో, ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది. పైన పేర్కొన్న పొడిగింపు మరియు/లేదా సవరణలు, బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల, భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని అన్వయించుకోరాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/2059 |