<font face="mangal" size="3">ది కపోల్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారా - ఆర్బిఐ - Reserve Bank of India
ది కపోల్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు (డైరెక్షన్స్) – నిర్దేశాల కాలపరిమితి పొడిగింపు
తేది: 31/07/2019 ది కపోల్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర - బ్యాంకింగ్ నియంత్రణ ది కపోల్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర ఫై మార్చ్ 30, 2017 పని వేళల ముగింపు నుండి ఆరు నెలల కాలానికి భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశాలు విధించింది. అట్టి నిర్దేశాల కాల పరిమితిని సమయానుసారంగా పొడిగిస్తూ జనవరి 24, 2019 నాటి ఆదేశం ద్వారా జులై 31, 2019 వరకు పొడిగించింది. ది కపోల్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర ఫై మార్చ్ 30, 2017 ఆదేశం ద్వారా విధించిన మరియు జనవరి 24, 2019 నాటి ఆదేశం ద్వారా పొడిగించిన నిర్దేశాలను, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A (1) క్రింద ప్రదానం చేసిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు మరో ఆరు నెలలపాటు అంటే ఆగష్టు 01, 2019 నుండి జనవరి 31, 2020 వరకు సమీక్షకు లోబడి, పొడిగించబడినవని ప్రజలకు తెలియచేయడమైనది. నిర్దేశం క్రింద వున్న ఇతర నియమ, నిబంధనలలో ఎటువంటి మార్పు ఉండదు. జులై 23, 2019 నాటి నిర్దేశాల యొక్క నకలు బ్యాంకు ప్రాంగణంలో, ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది. పైన పేర్కొన్న పొడిగింపు మరియు/లేదా సవరణలు, బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని అన్వయించుకోరాదు. యోగేశ్ దయాల్ పత్రికా ప్రకటన: 2019-2020/300 |