బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 35 A క్రింద నిర్దేశాల జారీ - ది మరాఠా సహకారి బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర
తేదీ: 30/09/2019 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 35 A ఆగస్ట్ 31, 2016 తేదీ ఆదేశాలద్వారా, ది మరాఠా సహకారి బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర, ఆగస్ట్ 31, 2016 పని ముగింపు వేళల నుండి, నిర్దేశాల పరిధిలోకి తేబడినది. ఆ నిర్దేశాల గడువు, తదుపరి అదేశాల ద్వారా ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, మార్చ్ 25, 2019 తేదీన జారీ చేసిన చివరి ఆదేశం ద్వారా, సెప్టెంబర్ 30, 2019 వరకు, సమీక్షకు లోబడి పొడిగించబడినది. రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 35 A, (సెక్షన్ 56తో సహా), సబ్-సెక్షన్ (1), ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలు వినియోగించి, ఆగస్ట్ 31, 2016 న పైన పేర్కొన్న బ్యాంకుకు జారీ చేయబడి, ఆ తరువాత ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివరి సారి సెప్టెంబర్ 30, 2019 వరకు పొడిగించబడ్డ నిర్దేశాలు, మరొక మూడు నెలల (అనగా అక్టోబర్ 01, 2019 నుండి డిసెంబర్ 31, 2019 వరకు) బ్యాంకుకు వర్తిస్తాయని, సెప్టెంబర్ 25, 2019 తేదీన అదేశించడం జరిగిందని, ప్రజలకు తెలియజేయచేస్తున్నాము. ఈ ఆదేశాలు తిరిగి సమీక్షించవచ్చు. కాలపరిమితి పెంచుతూ, సెప్టెంబర్ 25, 2019 న జారీచేసిన ఆదేశాల ప్రతి, మరాఠా సహకారి బ్యాంకు ఆవరణలో, ప్రజల సమాచారార్ధం, ప్రదర్శించబడినది. పైన తెలిపిన కాలపరిమితి పొడిగింపు మరియు / లేక మార్పులు చేసినంతమాత్రాన, బ్యాంకుయొక్క ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడిందని రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందినట్లుగా, ఏ మాత్రమూ భావించరాదు. (యోగేశ్ దయాల్) పత్రికా ప్రకటన: 2017-2018/816 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: