<font face="mangal" size="3">సెక్షన్ 35ఎ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎ - ఆర్బిఐ - Reserve Bank of India
సెక్షన్ 35ఎ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) క్రింద నిర్దేశాలు - ది
ముధోల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పోస్ట్ ముధోల్, బాగల్కోట్ జిల్లా, కర్ణాటక
ఏప్రిల్ 09, 2019 సెక్షన్ 35ఎ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) క్రింద నిర్దేశాలు - ది ఇందుమూలంగా ప్రజల సమాచారం కోసం, భారతీయ రిజర్వు బ్యాంక్ బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సబ్-సెక్షన్ (1) సెక్షన్ 35 ఎ, తో పాటు సెక్షన్ 56 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో ది ముధోల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పోస్ట్ ముధోల్, బాగల్కోట్ జిల్లా, కర్ణాటక పై కొన్ని నిర్దేశాలను జారీ చేసింది. అందుమూలంగా, ఏప్రిల్ 08, 2019 తేదీ పనివేళల ముగింపు నుండి పైన పేర్కొనబడిన బ్యాంక్, ఏప్రిల్ 02, 2019 వ తేదీన ప్రకటించబడ్డ ఆర్బీఐ నిర్దేశాల ప్రకారం తప్ప ముందస్తు లిఖితపూర్వక అనుమతి ఆర్బీఐ నుండి పొందనిదే, ఎటువంటి లోన్స్ మరియు అడ్వాన్సులు ఇవ్వరాదు మరియు వీటిని నవీకరించరాదు; కొత్త పెట్టుబడులు పెట్టరాదు; అప్పులు తీసుకొనుట, క్రొత్త డిపాజిట్లు అంగీకరించడంతో సహా, ఎటువంటి రుణభారం స్వీకరించరాదు; వారి విధులు, బాధ్యతలు నేరవేర్చుటలో గాని ఇంకే విధంగాగాని, చెల్లింపులు చేయడం, చెల్లింపుకై అంగీకరించడo చేయరాదు; ఎటువంటి రాజీ, సర్దుబాటు ఒప్పందములు కుడుర్చుకోరాదు మరియు వారి ఆస్తులను, సంపత్తులను అమ్మరాదు, బదిలీ గాని ఇంకే విధంగాగాని వీటిని సర్దుబాటు చేయరాదు. ఈ ఆదేశాల నకలు ఆసక్తిగల ప్రజలచే పరిశీలించడం కోసం బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడుతుంది. ప్రత్యేకంగా, పైన పేర్కొన్న ఆదేశాల షరతులకు లోబడి, ప్రతి సేవింగ్స్ బ్యాంక్ ఖాతా లేదా కరెంట్ ఖాతా లేదా మరే యితర డిపాజిట్ ఖాతాలోని మొత్తం నిల్వలో ₹ 1,000/- (వెయ్యి రూపాయలు మాత్రమే) కు మించని మొత్తం వరకు వాపసుచేసుకొనుటకు అనుమతించబడుతుంది. ఆర్బీఐ చే పై నిర్దేశాల జారీ ని, స్వతహాగా బ్యాంక్ లైసెన్స్ ను రిజర్వు బ్యాంక్ రద్దు చేసినట్లుగా ఎంతమాత్రం భావింపరాదు. బ్యాంక్ తన ఆర్ధిక పరిస్థితి మెరుగయ్యే వరకూ, నిబంధనలకు లోబడి, తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. పరిస్థితులను బట్టి రిజర్వు బ్యాంక్ తమ నిర్దేశాలలో మార్పు చేసే అవకాశాన్ని పరిశీలించవచ్చు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన : 2018-2019/2407 |