RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78523219

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) సెక్షన్ 35ఎ క్రింద డైరెక్షన్స్ - ది నీడ్స్ అఫ్ లైఫ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై – మహారాష్ట్ర

ఏప్రిల్ 30, 2019

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) సెక్షన్ 35ఎ క్రింద డైరెక్షన్స్ - ది
నీడ్స్ అఫ్ లైఫ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై – మహారాష్ట్ర

ది నీడ్స్ అఫ్ లైఫ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర ను అక్టోబర్ 26, 2018 వ తేదీన జారీ చేసిన డైరెక్టివ్ ననుసరించి అక్టోబర్ 29, 2018 తేదీ వ్యాపార వేళలు ముగిసినప్పటి నుండి ఆరు నెలలకాలం పాటు ఆదేశాల (డైరెక్షన్స్) క్రింద ఉంచడం జరిగింది మరియు సమీక్షకు లోబడి ఈ ఆదేశాలు ఏప్రిల్ 29, 2019 వరకు చెల్లుబాటవుతాయి.

2. ప్రజల సమాచారంకోసం దీనిని నోటిఫై చేస్తున్నారు; బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35 ఎ (1) తో పాటు సెక్షన్ 56 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో భారతీయ రిజర్వు బ్యాంక్ ఈ బ్యాంక్ కు జారీచేసిన అక్టోబర్ 26, 2018 తేదీ డైరెక్టివ్ చెల్లుబాటు ఏప్రిల్ 29, 2019 వరకు యున్నది; ఇది మరో ఆరు నెలల పాటు అంటే ఏప్రిల్ 30, 2019 నుండి అక్టోబర్ 29, 2019 వ తేదీ వరకు ఆ బ్యాంకుకు వర్తిస్తుందని; సమీక్షకు లోబడి తమ ఏప్రిల్ 24, 2019 తేదీ డైరెక్టివ్ ద్వారా ఇందుమూలంగా నిర్దేశిస్తున్నారు.

3. పైన ఉల్లేఖించిన డైరెక్టివ్ లోని అన్ని ఇతర షరతులలో ఎటువంటి మార్పు లేదు. ఏప్రిల్ 24, 2019 తేదీ గడువు పొడిగింపు ఆదేశం నకలును ప్రజల పరిశీలనార్ధం బ్యాంక్ పరిసరాలలో ప్రదర్శించటం జరుగుతుంది.

4. భారతీయ రిజర్వు బ్యాంక్ చే పైన పేర్కొన్న పొడిగింపు మరియు / లేదా సవరణ ను అన్యధా బ్యాంక్ యొక్క ఆర్ధిక పరిస్థితి చెప్పుకోదగిన విధంగా మెరుగుపడిందని భారతీయ రిజర్వు బ్యాంక్ సంతృప్తిచెందిందనిగా పరిగణించరాదు.

శైలజా సింగ్
డిప్యూటీ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2018-2019/2562

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?