RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78520845

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్), సెక్షన్ 35 ఎ క్రింద నిర్దేశాలు – ది నీడ్స్ ఆఫ్ లైఫ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర

ఏప్రిల్ 29, 2020

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్), సెక్షన్ 35 ఎ
క్రింద నిర్దేశాలు – ది నీడ్స్ ఆఫ్ లైఫ్ కో-ఆపరేటివ్ బ్యాంక్
లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర.

ది నీడ్స్ ఆఫ్ లైఫ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర అక్టోబర్ 26, 2018 తేదీ నాటి ఆదేశం DCBS/CO.BSD-I/D-3/12.22.163/2018-19 ద్వారా, అక్టోబర్ 29, 2018 తేదీ పనివేళల ముగింపు నుండి ఆరు మాసాలపాటు సమీక్షకు లోబడి ఆర్బీఐ నిర్దేశాల క్రింద ఉంచబడింది. ఈ నిర్దేశాల వర్తింపు క్రితం పర్యాయం అక్టోబర్ 16, 2019 తేదీ నాటి ఆదేశం DCBR.CO.AID/No.D-31/12.22.160/2019-20 ద్వారా, ఏప్రిల్ 29, 2020 తేదీ వరకు సమీక్షకు లోబడి పొడిగించబడినది.

2. జనావళి సమాచారం నిమిత్తం తెలియజేయడం ఏమిటంటే - భారతీయ రిజర్వు బ్యాంకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35 ఎ (1) ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో పైన పేర్కొన్న బ్యాంక్ కు అక్టోబర్ 26, 2018 తేదీ న జారీచేసిన డైరెక్టివ్ నం. DCBS.CO.BSD-I/D-3/12.22.163/2018-19 చెల్లుబాటు, ఏప్రిల్ 29, 2020 వరకు పొడిగింపబడి, మరో ఆరు మాసాలబాటు ఏప్రిల్ 30, 2020 నుండి అక్టోబర్ 31, 2020 వరకు వర్తింపు కొనసాగుతుందని, సమీక్షకు లోబడి ఏప్రిల్ 24, 2020 తేదీ డైరెక్టివ్ DOR.CO.AID No.D-76/12.22.160/2019-20 ద్వారా ఇందుమూలంగా నిర్దేశించారు.

3. పైన ఉటంకించిన ఆదేశం లోని అన్ని ఇతర షరతులలో ఎటువంటిమార్పు లేదు. ఏప్రిల్ 24, 2020 తేదీ నాటి పొడిగింపు ఆదేశం నం. DOR.CO.AID/No.D-76/ 12.22.160/2019-20 నకలు ప్రజల పరిశీలనార్ధం బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడింది.

4. భారతీయ రిజర్వు బ్యాంకు చే పైన పేర్కొన్న ఆదేశం పొడిగింపు మరియు / లేదా సవరణ ను, బ్యాంక్ యొక్క ఆర్ధిక పరిస్థితి చెప్పుకోదగిన విధంగా మెరుగుపడిందని భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తిచెందిందనిగా అన్యధా పరిగణించరాదు.

(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/2286

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?