<font face="mangal" size="3px">బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (AACS) లోని సెక్ĸ - ఆర్బిఐ - Reserve Bank of India
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (AACS) లోని సెక్షన్ 35 A కింద ఉత్తరువులు – ద ఆర్ ఎస్ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర
మార్చి 26, 2017 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (AACS) లోని సెక్షన్ 35 A కింద ఉత్తరువులు – మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న ద ఆర్ ఎస్ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ జూన్ 24, 2015న జారీ చేసిన ఆదేశాలను అనుసరించి జూన్ 26, 2015న వ్యాపార లావాదేవీలు ముగిసినప్పటి నుంచి ఉత్తరువుల కింద ఉంది. తదుపరి మార్గదర్శకాలను అనుసరించి ఆ ఉత్తరువులను ఎప్పటికప్పుడు పొడిగిస్తూ, వాటిలో మార్పులు చేస్తూ రావడం జరుగుతోంది. చివరిసారిగా వాటిని జనవరి 31, 2017న పొడిగించడం జరిగింది. ఇవి మార్చి 25, 2017 వరకు, సమీక్షకు లోబడి, కొనసాగుతాయి. ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న ద ఆర్ ఎస్ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు జూన్ 24, 2015న జారీ చేసి, ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వచ్చిన ఉత్తరువులను, మార్చి 20, 2017న జారీ చేసిన సవరించిన ఉత్తరువులను అనుసరించి, సమీక్షకు లోబడి, మరో ఆరు నెలల పాటు - అనగా మార్చి 26, 2017 నుండి సెప్టెంబర్ 25, 2017 వరకు పొడిగించడమైనది. పైన పేర్కొన్న మార్పులు చేసిన మార్చి 20, 2017న జారీ చేసిన ఉత్తరువుల కాపీని ఆసక్తి కలిగిన ప్రజల పరిశీలనార్థం బ్యాంకు పరిసరాలలో ప్రదర్శించడం జరుగుతుంది. భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీచేసిన ఆ ఉత్తరువులోని మార్పులను అనుసరించి రిజర్వ్ బ్యాంకు ఆ బ్యాంకు యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడినట్లు భావిస్తోందని అనుకోరాదు. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్: 2016-17/2569 |