<font face="mangal" size="3">సెక్షన్‌ 35 A బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, (కో-ఆపర - ఆర్బిఐ - Reserve Bank of India
సెక్షన్ 35 A బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) క్రింద నిర్దేశాలు - ది ఆర్ ఎస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర
తేదీ: 25/01/2018 సెక్షన్ 35 A బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, జూన్ 24, 2015 తేదీన జారీ చేసిన ఆదేశాలద్వారా, ది ఆర్ ఎస్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ముంబై, మహారాష్ట్ర, జూన్ 26, 2015 పనిముగింపు వేళలనుండి, నిర్దేశాల పరిధిలోకి తేబడింది. ఈ నిర్దేశాల కాలపరిమితి, తదుపరి జారీచేసిన ఆదేశాల ద్వారా సవరించబడి/ పొడిగించబడుతూవచ్చింది. చివరిగా, సెప్టెంబర్ 20, 2017 తేదీ ఆదేశం ద్వారా వీటి అమలు కాలం, జనవరి 25, 2018 వరకు పొడిగించబడింది (వీటిని సమీక్షించవచ్చు). రిజర్వ్ బ్యాంక్ తమకు సబ్-సెక్షన్ (1), సెక్షన్ 35 A (సెక్షన్ 56తో సహా), బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, క్రింద దఖలుపరచబడిన అధికారాలతో, ది ఆర్ ఎస్ కో-ఆపరేటివ్ బ్యాంక్కు జూన్ 24, 2015 తేదీన ఆదేశాలు జారీచేసినది. తదుపరి ఎప్పటికప్పుడు సవరించబడుతూ ఈనిర్దేశాల కాలపరిమితి, సెప్టెంబర్ 20, 2017 తేదీన జారీచేసిన ఆదేశంద్వారా, జనవరి 25, 2018 వరకు పొడిగించబడినది. ఈనిర్దేశాలు, తిరిగి జనవరి 19, 2018 తేదీన జారీచేసిన ఆదేశాలద్వారా, మరొక ఆరు నెలలపాటు (అనగా జనవరి 26, 2018 నుండి జులై 25, 2018 వరకు) సవరణలకు లోబడి, పొడిగించబడినవని, ఇందుమూలంగా ప్రజలకు తెలియజేయడమైనది. జవరి 19, 2018న పై సవరణలు తెలుపుతూ జారీచేసిన ఆదేశాల ప్రతి, ప్రజల సమాచారంకోసం, ది ఆర్ ఎస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో ప్రదర్శించబడినది. పైన తెలిపిన సవరణలు చేసినంత మాత్రాన, బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడిందని, రిజర్వ్ బ్యాంక్, సంతృప్తిచెందినదని భావించరాదు. అనిరుద్ధ డి జాధవ్ పత్రికా ప్రకటన: 2017-2018/2033 |