<font face="Mangal" size="3">ది ఆర్ ఎస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహరాష - ఆర్బిఐ - Reserve Bank of India
ది ఆర్ ఎస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహరాష్ట్ర – బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 35 A క్రింద నిర్దేశాలు
తేదీ: జులై 10, 2018 ది ఆర్ ఎస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహరాష్ట్ర – జూన్ 24, 2015 తేదీ ఆదేశాలద్వారా, ది ఆర్ ఎస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర, జూన్ 26, 2015 పని ముగింపు వేళల నుండి, నిర్దేశాల పరిధిలోకి తేబడినది. ఈ నిర్దేశాలు ఎప్పటికప్పుడు మార్చబడుతూ / పొడిగించబడుతూ వచ్చాయి. జనవరి 19, 2018 న జారీ చేసిన చివరి ఆదేశాలు, జులై 25, 2018 వరకు, సమీక్షకు లోబడి, అమలులో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సెక్షన్ 35 A, (సెక్షన్ 56తో సహా), సబ్-సెక్షన్ (1), ద్వారా తమకు దఖలుపరచబడ్డ అధికారాలు వినియోగించి, ది ఆర్ ఎస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్రకు జూన్ 24, 2015 న జారీ చేయబడి ఎప్పటికప్పుడు మార్చబడుతూ / పొడిగించబడుతూ, చివరిసారిగా జులై 25, 2018 వరకు పొడిగించబడిన (జనవరి 19, 2018 ఆదేశాల ద్వారా) నిర్దేశాలు, మరొక ఆరు నెలల వరకు (అనగా జులై 26, 2018 నుండి జనవరి 25, 2019 వరకు) బ్యాంకుకు వర్తిస్తాయని, జులై 02, 2018 తేదీన అదేశించడం జరిగిందని, ప్రజలకు తెలియజేయడమైనది. ఈ ఆదేశాలు తిరిగి సమీక్షించవచ్చు. పై మార్పులు సూచిస్తూ, జులై 02, 2018 న జారీచేసిన ఆదేశాల ప్రతి, ఆర్ ఎస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి. ఆవరణలో, ప్రజల సమాచారార్ధం, ప్రదర్శించబడినది. పైన తెలిపిన మార్పులు చేసినంతమాత్రాన, బ్యాంకుయొక్క ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడిందని రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందినట్లుగా, ఏ మాత్రమూ భావించరాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/90 |