<font face="mangal" size="3">యు.పి. సివిల్ సెక్రటేరియట్ ప్రాథమిక సహకార బ్ - ఆర్బిఐ - Reserve Bank of India
యు.పి. సివిల్ సెక్రటేరియట్ ప్రాథమిక సహకార బ్యాంకు లిమిటెడ్, లక్నో ఫై, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం (BR Act), 1949 (సహకార సంఘాలకు వర్తించేది), సెక్షన్ 35A క్రింద నిర్దేశాల (డైరెక్షన్స్) విధింపు
సెప్టెంబర్ 26, 2018 యు.పి. సివిల్ సెక్రటేరియట్ ప్రాథమిక సహకార బ్యాంకు లిమిటెడ్, లక్నో ఫై, ప్రజా ప్రయోజనం కోసం సంతృప్తి చెందినదై, యు.పి. సివిల్ సెక్రటేరియట్ ప్రాథమిక సహకార బ్యాంకు లిమిటెడ్, లక్నో ఫై, కొన్ని నిర్దేశాలను (డైరెక్షన్) విధించాలని భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. ఆ విధంగా, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 లోని సెక్షన్ 56 తో కలిపి, సబ్ సెక్షన్ (1), సెక్షన్ 35A క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, సెప్టెంబర్ 25, 2018 పని వేళల ముగింపు నుండి, యు.పి. సివిల్ సెక్రటేరియట్ ప్రాథమిక సహకార బ్యాంకు లిమిటెడ్, లక్నో ఫై ఈ నిర్దేశాలను ఆదేశించింది; భారతీయ రిజర్వు బ్యాంకు నుండి ముందస్తు లిఖిత అనుమతి లేకుండా బ్యాంకు ఎటువంటి రుణాలను మంజూరు చేయడం లేదా పునరుద్ధరించడం, ఏదైనా పెట్టుబడులను పెట్టడం, ఎటువంటి బాధ్యతను అంటే నిధులను అప్పుతెచ్చుకోవడం, మరియు తాజా డిపాజిట్లను ఆమోదించడం, మరియు తన చెల్లింపు బాధ్యతల మొత్తాలనించి వేరే చెల్లింపుల పంపిణీకి వొడంబడటం లేదా ఏదైనా రాజి లేక పరిష్కార ప్రయత్నాలు చేయడం, తన ఆస్తులను బదలాయించడం లేదా అమ్మడం మొదలగు కార్యకలాపాలు, సెప్టెంబర్ 25, 2018 పని వేళల ముగింపు నుండి చేయ రాదు; మిగతా వాటితో కలిపి, ఈ క్రింద ఉదహరించిన పద్దతిలో/ఆ మేరకు తప్ప; ప్రతి డిపాజిటుదారు పొదుపు ఖాతా లేక కరెంట్ ఖాతా లేదా మొత్తం డిపాజిట్ ఖాతా నుండి కేవలం ₹ 1000 (రూ. ఒక వేయి రూపాయలు మాత్రమే) తీసుకోవచ్చు. ఒకవేళ ఖాతాదారుడు బ్యాంకుకు అప్పుగా లేక పూచీకత్తుగా లేక మరే విధంగానైనా రుణపడి వున్నట్లైతే, ముందుగా అట్టి దానిని సంబంధిత ఖాతాలకు సర్దుబాటు చేసిన తరువాత మాత్రమే బ్యాంకు నుండి పై విధంగా డబ్బు తీసుకోవచ్చు. ప్రస్తుత టర్మ్ డిపాజిట్లను పరిపక్వతపై, అవే షరతులపై పునరుద్ధరించవచ్చు. నిర్దేశాల్లో అనుమతించిన విధంగా వ్యయం జరపవచ్చు. ప్రభుత్వ/SLR ఆమోదం పొందిన సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టవచ్చు. భారతీయ రిజర్వు బ్యాంకు నుండి ప్రత్యేకమైన అనుమతి లేకుండా బ్యాంకు ఏ ఇతర బాధ్యతలను నివృత్తి చేయ రాదు లేక చేపట్ట రాదు. నిర్దేశాల యొక్క వివరాలు, బ్యాంకు ప్రాంగణంలో, ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినవి. భారతీయ రిజర్వు బ్యాంకు ఈ నిర్దేశాలలో మార్పులను పరిస్థితుల మీద ఆధారపడి పరిగణించవచ్చును. ఆర్ బి ఐ ద్వారా జారీ చేయబడిన ఫై నిర్దేశాలను, ఆర్ బి ఐ ద్వారా బ్యాంకింగ్ లైసెన్సు రద్దు చేసే అంశంగా భావించరాదు. పరిమితులకు లోబడి బ్యాంకు తన బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తుంది. ఈ మార్గదర్శకాలు సెప్టెంబర్ 25, 2018 పని వేళల ముగింపు నుండి ఆరు నెలల వ్యవధి కాలానికి, సమయానుసారంగా సమీక్షతో అమలులో ఉంటాయి. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/712 |