<font face="mangal" size="3">వసంత్ దాదా నగరి సహకారి బ్యాంకు లిమిటెడ్, ఉస్ - ఆర్‌బిఐ - Reserve Bank of India
వసంత్ దాదా నగరి సహకారి బ్యాంకు లిమిటెడ్, ఉస్మానాబాద్, మహారాష్ట్ర ఫై బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) క్రింద నిర్దేశాలు - కాలపరిమితి పొడిగింపు
తేదీ: 16/10/2019 వసంత్ దాదా నగరి సహకారి బ్యాంకు లిమిటెడ్, ఉస్మానాబాద్, మహారాష్ట్ర ఫై బ్యాంకింగ్ వసంత్ దాదా నగరి సహకారి బ్యాంకు లిమిటెడ్, ఉస్మానాబాద్, మహారాష్ట్ర ఫై, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది), సబ్ సెక్షన్ (1) సెక్షన్ 35A క్రింద నవంబరు 13, 2017 పని వేళలు ముగిసే సమయం నుండి ఆరు నెలల కాలానికి, ప్రజా ప్రయోజనం కోసం భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశాలను విధించింది. అట్టి నిర్దేశాలను, భారతీయ రిజర్వు బ్యాంకు మరో మూడున్నర నెలల వ్యవధి కొరకు అంటే అక్టోబర్ 14, 2019 నుండి జనవరి 31, 2020 వరకు సమీక్షకు లోబడి, పొడిగించింది. ఈ నిర్దేశాలు డిపాజిట్ల ఉపసంహరణ/స్వీకరణల పై కొన్ని నిబంధనలను లేదా పరిమితులను స్పష్టంగా నిర్ణయించాయి. వివరణాత్మక నిర్దేశాలు బ్యాంక్ యొక్క ప్రాంగణంలో ఆసక్తిగల సభ్యుల పరిశీలన కోసం ప్రదర్శించబడ్డాయి. పరిస్థితుల మీద ఆధారపడి భారతీయ రిజర్వు బ్యాంకు, నిర్దేశాల మార్పులను పరిగణించవచ్చు. ఈ చర్య భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా బ్యాంకింగ్ లైసెన్సు రద్దు చేసే చర్యగా భావించరాదు. ఆర్ధిక స్థితి మెరుగుపడేంతవరకు, పరిమితులకు లోబడి బ్యాంకు తన బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తుంది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/963 |