యూత్ డెవలప్మెంట్ సహకార బ్యాంకు లిమిటెడ్, కొల్హాపూర్, మహారాష్ట్ర – బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్ 35A క్రింద నిర్దేశాల (డైరెక్షన్స్) విధింపు
తేది: 05/07/2019 యూత్ డెవలప్మెంట్ సహకార బ్యాంకు లిమిటెడ్, కొల్హాపూర్, మహారాష్ట్ర – యూత్ డెవలప్మెంట్ సహకార బ్యాంకు లిమిటెడ్, కొల్హాపూర్, మహారాష్ట్ర, జనవరి 04, 2019 నాటి ఆదేశం ద్వారా ఆరు నెలల కాలానికి, జనవరి 05, 2019 పని ముగింపు వేళల నుండి నిర్దేశాల క్రింద ఉంచబడింది. అట్టి నిర్దేశాలు, సమీక్షకు లోబడి జూలై 05, 2019 వరకు అమలులో ఉంటాయి. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా), సెక్షన్ 35A(1) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని యూత్ డెవలప్మెంట్ సహకార బ్యాంకు లిమిటెడ్, కొల్హాపూర్, మహారాష్ట్ర ఫై విధించి సమయానుసారంగా జూలై 05, 2019 వరకు పొడిగింపబడిన జనవరి 04, 2019 నాటి నిర్దేశం కాల పరిమితి మరో ఆరు నెలల కాలానికి అంటే జులై 06, 2019 నుండి జనవరి 05, 2020 వరకు, సమీక్షకు లోబడి జూలై 02, 2019 నాటి ఆదేశం ప్రకారం బ్యాంకు పై అమలులో ఉంటుంది. నిర్దేశం క్రింద వున్న ఇతర నియమ, నిబంధనలలో ఎటువంటి మార్పు ఉండదు. జూలై 02, 2019 ద్వారా పొడిగింపబడిన నిర్దేశాల యొక్క నకలు, బ్యాంకు ప్రాంగణంలో, ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది. భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా పొడిగింపబడిన/మార్పుతో జారీచేయబడిన ఫై నిర్దేశం, బ్యాంక్ యొక్క ఆర్ధిక స్థితిలో మెరుగుదలగా భారతీయ రిజర్వు బ్యాంకు తృప్తిచెందినదని భావించరాదు. యోగేష్ దయాళ్ పత్రికా ప్రకటన: 2019-2020/70 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: