RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78497745

ది యునైటెడ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., బగ్నాన్‌ స్టేషన్‌ రోడ్ (నార్త్), PO బగ్నాన్‌, జిల్లా హౌడా, PIN 711303, పశ్చిమ బెంగాల్ - సెక్షన్‌ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) క్రింద ఆదేశాలు జారీ

తేది: జులై 24, 2018

ది యునైటెడ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., బగ్నాన్‌ స్టేషన్‌ రోడ్ (నార్త్), PO బగ్నాన్‌, జిల్లా హౌడా, PIN
711303, పశ్చిమ బెంగాల్ - సెక్షన్‌ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు
వర్తించేమేరకు) క్రింద ఆదేశాలు జారీ

సెక్షన్‌ 35A బ్యాంకింగ్ రెగ్యులేషన్‌ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) (సెక్షన్‌ 56 తో కలిపి), సబ్-సెక్షన్‌ (1) క్రింద తమకు దఖలు పరచిన అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్, ది యునైటెడ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి. బగ్నాన్‌ స్టేషన్‌ రోడ్ (నార్త్), PO బగ్నాన్‌, జిల్లా హౌడ, PIN. 711303, పశ్చిమ బెంగాల్‌కు, కొన్ని ఆదేశాలను జారీ చేసింది. వీటిని అనుసరించి, జులై 18, 2018, పనివేళల ముగింపు సమయంనుండి, పైన పేర్కొన్న బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ లిఖితపూర్వక అనుమతి లేనిదే, పై ఆదేశాలు అతిక్రమించి, అప్పులు, రుణాలు జారీ చేయుట; పెట్టుబడులు పెట్టుట; అప్పులు, క్రొత్త డిపాజిట్లు స్వీకరించుటతో కలిపి ఎటువంటి భారము అంగీకరించుట; వారు చేసిన రుణాలు తిరిగి చెల్లించుటకు లేక మరొక కారణంగాగాని ఎటువంటి చెల్లింపులు చేయుట లేక చెల్లించుటకు అంగీకరించుట; రాజీ లేక ఇతర ఒప్పందాలు కుదుర్చుకొనుట; వారి ఆస్తులను అమ్ముట, బదిలీ చేయుట లేక ఇతర మార్గాలలో ఇచ్చివేయుట, నిషేధించబడినదని ఇందుమూలముగా ప్రజలకు తెలియచేయడమైనది. జులై 12, న జారీ చేసిన ఆదేశాల ప్రతి, ది యునైటెడ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రాంగణంలో ప్రజల సమాచారం కోసం, ప్రదర్శింపబడినది. ప్రత్యేకించి, సేవింగ్స్ బ్యాంక్ / కరెంట్ అకౌంట్ / ఇతర పేర్లతో పిలువబడే ఏ ఇతర డిపాజిట్ ఖాతా నుండి, రూ. 1000 (ఒక వెయ్యి రూపాయిలు) మించి విత్‌డ్రా చేయుటకు అనుమతించరాదు. అయితే, ఖాతాదారు, రుణ గ్రహీతగా గాని లేక హామీదారుగా గాని బ్యాంకుకు తీర్చవలసిన బాకీ ఉన్నట్లయితే, ముందుగా ఆ సొమ్ము, రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలలో వివరించినట్లు, సరిపెట్టవలెను.

పై నిర్దేశాలు జారీ చేసినంత మాత్రాన, బ్యాంకు లైసెన్స్ రద్దు చేసినట్లు భావించరాదు. బ్యాంక్, వారి ఆర్థిక స్థితి మెరుగుపడేవరకు, కొన్ని నిబంధనలతో బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. పరిస్థితులను సమీక్షించి, రిజర్వ్ బ్యాంక్ ఈనిర్దేశాలలో మార్పులు చేయవచ్చు. ఈ ఆదేశాలు, జులై 18, 2018 బ్యాంక్ పనివేళల ముగింపు సమయంనుండి, ఆరు నెలలపాటు అమలులో ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు సమీక్షించవచ్చును.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/205

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?