<font face="mangal" size="3">హిందు కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పఠాన్‌కోట్, పంజ& - ఆర్బిఐ - Reserve Bank of India
హిందు కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పఠాన్కోట్, పంజాబ్, - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు - గడువు పొడిగింపు
తేది: 27/09/2019 హిందు కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పఠాన్కోట్, పంజాబ్, - రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సబ్-సెక్షన్ 1, సెక్షన్ 35A (సెక్షన్ 56 తో కలిపి), తమకు దఖలుపరచిన అధికారాలతో, ప్రజాహితందృష్ట్యా, హిందు కో-ఆపరేటివ్ బ్యాంకు లి., పఠాన్కోట్, పంజాబ్ను, మార్చ్ 25, 2019 పని ముగింపువేళ నుండి నిర్దేశాల పరిధిలోనికి తెచ్చినది. ఈ నిర్దేశాలు, కొన్ని మార్పులతో, మార్చ్ 24, 2020 వరకు పొడిగించబడినవి. అమలుకాలం పొడిగిస్తూ జారీచేసిన నిర్దేశంయొక్క ప్రతి, హిందు కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం / శాఖలు / బ్యాంకు ఇతర ప్రాంగణాలలో ప్రదర్శింపబడినది (యోగేశ్ దయాల్) పత్రికా ప్రకటన: 2019-2020/801 |