<font face="mangal" size="3px">బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) సెక్షన - ఆర్బిఐ - Reserve Bank of India
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) సెక్షన్ 35ఎ తో పాటు సెక్షన్ 56 క్రింద డైరెక్షన్స్ - ది సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై – అవధి పొడిగింపు
ఏప్రిల్ 16, 2019 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) సెక్షన్ 35ఎ తో పాటు సెక్షన్ 56 క్రింద డైరెక్షన్స్ - ది సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై – అవధి పొడిగింపు ముంబై, లోని ది సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ను ఏప్రిల్ 17, 2018 వ తేదీన జారీ చేసిన ఆదేశాలననుసరించి ఏప్రిల్ 17, 2018 తేదీ వ్యాపార లావాదేవీలు ముగిసినప్పటి నుండి ఆరు నెలలపాటు ఆర్బీఐ ఆదేశాల క్రింద ఉంచడం జరిగింది. పై అదేశాల వర్తింపు ఎప్పటికప్పుడు పొడిగింపబడుతూ, ఇతః పూర్వం అక్టోబర్ 15, 2018 తేదీ డైరెక్టివ్ ద్వారా ఏప్రిల్ 17, 2019 తేదీ వరకు పొడిగింపబడింది. ప్రజల సమాచారంకోసం దీనిని నోటిఫై చేస్తున్నారు; బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35 ఎ (1) తో పాటు సెక్షన్ 56 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో భారతీయ రిజర్వు బ్యాంక్ ది సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై కు జారీచేసిన ఏప్రిల్ 17, 2018 తేదీ డైరెక్టివ్ ఎప్పటికప్పుడు సవరించబడుతూ చివరిసారి ఏప్రిల్ 17, 2019 వరకు పొడిగింపబడి; మరో ఆరు నెలల పాటు అంటే ఏప్రిల్ 18, 2019 నుండి అక్టోబర్ 17, 2019 వ తేదీ వరకు ఆ బ్యాంకుకు వర్తిస్తుందని; సమీక్షకు లోబడి తమ ఏప్రిల్ 09, 2019 తేదీ డైరెక్టివ్ ద్వారా ఇందుమూలంగా నిర్దేశిస్తున్నారు. పైన ఉల్లేఖించిన డైరెక్టివ్ లోని అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులలో ఎటువంటిమార్పు లేదు. ఏప్రిల్ 09, 2019 తేదీ నాటి గడువు పొడిగింపు ఆదేశం నకలును ప్రజల పరిశీలనార్ధం బ్యాంక్ పరిసరాలలో ప్రదర్శించటం జరుగుతుంది. భారతీయ రిజర్వు బ్యాంక్ చే పైన పేర్కొన్న పొడిగింపు మరియు / లేదా సవరణ ను అన్యధా బ్యాంక్ యొక్క ఆర్ధిక పరిస్థితి చెప్పుకోదగిన విధంగా మెరుగుపడిందని రిజర్వు బ్యాంక్ సంతృప్తిచెందిందనిగా పరిగణించరాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/2468 |