RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78518528

ది కపోల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహరాష్ట్ర –
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు),
సెక్షన్‌ 35 A (సెక్షన్‌ 56 తో కలిపి) క్రింద నిర్దేశాలు

తేదీ: 31/01/2019

ది కపోల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహరాష్ట్ర –
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు),
సెక్షన్‌ 35 A (సెక్షన్‌ 56 తో కలిపి) క్రింద నిర్దేశాలు

మార్చ్ 30, 2017 తేదీ ఆదేశాలద్వారా, ది కపోల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర, మార్చ్ 30, 2017 పని ముగింపు వేళల నుండి, ఆరు నెలల వరకు నిర్దేశాల పరిధిలోకి తేబడినది. ఈ నిర్దేశాలు ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, జులై 23, 2018 జారీ చేసిన ఆదేశాల ద్వారా, జనవరి 31, 2019 వరకు అమలులో ఉన్నాయి .

రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సెక్షన్‌ 35 A, (సెక్షన్‌ 56తో సహా), సబ్-సెక్షన్‌ (1), ద్వారా తమకు దఖలుపరచబడ్డ అధికారాలు వినియోగించి, ది కపోల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్రకు, మార్చ్ 30, 2017 న జారీ చేయబడి జులై 23, 2018 ఆదేశాలద్వారా పొడిగించబడిన నిర్దేశాలు, మరొక ఆరు నెలల వరకు (అనగా ఫిబ్రవరి 01, 2019 నుండి జులై 31, 2019 వరకు) బ్యాంకుకు వర్తిస్తాయని, ప్రజలకు తెలియజేయడమైనది. ఈ ఆదేశాలు తిరిగి సమీక్షించవచ్చు.

పైన పేర్కొన్న ఆదేశాలలోని ఇతర నియమ నిబంధనలలో ఏ మార్పూ లేదు.

నిర్దేశాల అమలుకాలం పొడిగిస్తూ జారీచేసిన ఆదేశం DCBR.CO.AID. No. D-29/12.22.111/2018-19 తేదీ 24, 2019 నకలు, ప్రజల సమాచారార్ధం, కపోల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి. ఆవరణలో, ప్రదర్శించబడినది.

పైన తెలిపిన మార్పులు చేసినంతమాత్రాన, బ్యాంకుయొక్క ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడిందని రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందినట్లుగా, ఏ మాత్రమూ భావించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/1798

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?