RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78514653

యునైటెడ్ సహకార బ్యాంకు లిమిటెడ్, బాగ్నన్, జిల్లా హౌరా, పశ్చిమ బెంగాల్ –బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది), సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు – కాలపరిమితి పొడిగింపు

తేది : 22/10/2019

యునైటెడ్ సహకార బ్యాంకు లిమిటెడ్, బాగ్నన్, జిల్లా హౌరా, పశ్చిమ బెంగాల్ –బ్యాంకింగ్
నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది), సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు –
కాలపరిమితి పొడిగింపు

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A(1) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, యునైటెడ్ సహకార బ్యాంకు లిమిటెడ్, బాగ్నన్, పశ్చిమ బెంగాల్ ఫై భారతీయ రిజర్వు బ్యాంకు, జులై 18, 2018 పనివేళల ముగింపు నుండి నిర్దేశాలు విధించింది. సమయానుసారంగా మరియు చివరిగా అక్టోబర్ 18, 2019 వరకు పొడిగించిన అట్టి నిర్దేశాల కాలపరిమితిని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మరో ఆరు నెలల కాలానికి అంటే అక్టోబర్ 19, 2019 నుండి ఏప్రిల్ 18,2020 వరకు భారతీయ రిజర్వు బ్యాంకు పొడిగించింది. నిర్దేశాల యొక్క నకలు బ్యాంకు ప్రాంగణంలో, ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది.

భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జారీ చేసిన ఫై నిర్దేశాలు, బ్యాంకింగ్ లైసెన్సు రద్దు చేసినట్లు భావించరాదు. ఆర్ధిక స్థితి మెరుగుపడేంతవరకు పరిమితులతోకూడిన బ్యాంకింగ్ వ్యాపారాన్ని బ్యాంకు కొనసాగించవచ్చు. పరిస్థితుల మీద ఆధారపడి నిర్దేశాలలో మార్పులను సమయానుసారంగా, భారతీయ రిజర్వు బ్యాంకు పరిగణలోకి తీసుకోవచ్చు.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/1001

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?