<font face="mangal" size="3">సెక్షన్ 56 తో కలిపి సెక్షన్‌ 35 A, బ్యాంకింగ్ నియంĶ - ఆర్బిఐ - Reserve Bank of India
సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 క్రింద నిర్దేశాలు - హరిహరేశ్వర్ సహకరి బ్యాంక్ లిమిటెడ్, వాయ్, సతారా - కాలపరిమితి పొడిగింపు
ఫిబ్రవరి 28, 2023 సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35 A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 భారతీయ రిజర్వు బ్యాంకు, మే 31, 2022 నాటి ఆదేశం CO.DOS.DSD.No.S1012/12-07-005/2022-23 ద్వారా హరిహరేశ్వర్ సహకరి బ్యాంక్ లిమిటెడ్, వాయ్, సతారా ను, మే 31, 2022వ తేదీ పనివేళల ముగింపు నుండి నిర్దేశాల క్రింద ఉంచింది. 2. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A (1) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, పైన ఉటంకించిన నిర్దేశాలు మే 31, 2023 వరకు, ఫిబ్రవరి 27, 2023 నాటి తమ ఆదేశం DOR.MON/D-79/12.07.464/2022-23 ద్వారా సమీక్షకు లోబడి, అమలులో వుంటాయని భారతీయ రిజర్వు బ్యాంకు తెలియజేస్తున్నది. 3. పైన సూచించిన ఆదేశాల యొక్క అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులు మారవు. నిర్దేశాల కాల పరిమితి పొడిగింపును సూచించే ఫిబ్రవరి 27, 2023 తేదీ నాటి ఆదేశం యొక్క నకలు, బ్యాంక్ ప్రాంగణంలో ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది. 4. పైన పేర్కొన్న నిర్దేశాల పొడిగింపు మరియు/లేదా సవరణలను బ్యాంక్ యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని భావించరాదు. (యోగేశ్ దయాళ్) పత్రికా ప్రకటన: 2022-2023/1802 |